Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: జనగణన కార్యక్రమంలో భాగంగా తిప్పర్తి మండలంలో నిర్వహించనున్న 20 27- జనగణన ముందస్తు కార్యక్ర మాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి ఎన్యుమ రేటర్లు, సూపర్వైజర్ లను ఆదేశిం చారు. 2027 జనాభా లెక్కల సేక రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం లో 3 ప్రాంతాలలో ముందస్తు గణన కార్యక్రమాన్ని పైలట్ పద్ధతిలో చేప ట్టేందుకు ఎంపిక చేయగా, పట్టణ ప్రాంతంలో జిహెచ్ఎంసి, గ్రామీణ ప్రాంతంలో నల్గొండ జిల్లాలోని తి ప్పర్తి మండలం, గిరిజన ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నా యి. ఇందులో భాగంగా తిప్పర్తి మండలంలోని మామిడాల, ఇండ్లూ రు, సర్వారం, తిప్పర్తి , జంగారెడ్డి గూడెంలలో జనగణన చేయను న్నారు. ఇందుకుగాను 35 మంది ఎన్యుమరేటర్లు, 6 మంది సూపర్వై జర్లకు ఉద్దేశించి తిప్పర్తి రైతు వేది కలో ఆదివారం నుండి 3 రోజుల పా టు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆది వా రం ప్రారంభించారు.
అనంతరం ఆ మె మాట్లాడుతూ మొదటిసారిగా డిజిటల్ పద్ధతిలో జనగణన నిర్వ హిస్తున్నందున ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాలని, క్షేత్రస్థా యిలో ఏవైనా సమస్యలు వస్తే రా ష్ట్ర స్థాయికి ఈ సమస్యలను తీసు కువెళ్లడం ద్వారా సరిచేసుకునేందు కు అవకాశం ఉంటుందని చెప్పారు.
ఈ ముందస్తు జనగణన కార్యక్ర మంలో భాగంగా ఈ నెల 10 నుండి 15 వరకు పైన పేర్కొన్న 5 గ్రామాల లో ఎన్యుమరేటర్లు ఇండ్లకు వెళ్లి మొబైల్ యాప్ లో ఇండ్లను మ్యా పింగ్ చేయడం జరుగుతుంది. అ నంతరం ఈనెల 15 నుండి 30 వర కు ఇంటింటికి వెళ్లి నిర్దేశించిన ప్రొ ఫార్మాలో డిజిటల్ విధానంలో జనా భా లెక్కలను పూర్తి వివరాలతో సేక రించడం జరుగుతుంది. మిర్యాల గూడ సబ్ కలెక్టర్ నారాయణ అమి త్, రాష్ట్ర గణాంక శాఖ జెడి లాజర స్, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, తదితరులు మాట్లాడారు. తహసీ ల్దార్ రామకృష్ణ తదితరులు ఉన్నా రు.
