Collector Ila Tripathi : ప్రజా దీవెన, మునుగోడు: సహజ వ్యవసాయం ద్వారా కల్తీలేని ఆరో గ్యకరమైన ఆహారం లభిస్తుందని, రైతులు ఈ పద్ధతిని అవలంబిస్తే నాణ్యతతో పంటలు పండుతాయ ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నా రు. దీనిని దృష్టిలో ఉంచుకొని సహ జ వ్యవసాయాన్ని ప్రో త్సహించా ల్సిన అవసరం ఉందన్నారు. గురు వారం ఆమె మునుగోడు నియోజ కవర్గంలోని కిష్టాపురం గ్రామంలో ర సాయన ఎరువులు, పురుగుమం దులు వాడకుండా యువరైతు జ క్కుల వెంకటేశ్ పండిస్తున్న సహజ పంటలను పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ స హ జ పంటలను ఏవిధంగా పండి స్తు న్నారని అడిగి తెలుసుకున్నారు.ఈ పంటల వలన లాభాలు, పంటలు ఏవిధంగా ఉన్నాయి, ఈ పంటలు కావలసిన సహజ ఎరువులు వంటి వివరాలు అడిగారు. జీవామృతం జీవగణామృతం వాడతామని వెం కటేష్ చెప్పారు.
సహజ వ్యవసాయం ద్వారా రైతుల ఉత్పత్తి వ్యయాలు తగ్గి, నాణ్యమై న పంటలు, పర్యావరణానికి హాని లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని, జిల్లాలో సహజ వ్య వసాయాన్ని ప్రోత్సహించాలని, రై తులు ఈ పద్ధతిని అవలంబిస్తే భూ సారాన్ని కాపాడుతూ ఆరోగ్యకర మైన పంటలను ఉత్పత్తి చేయగలు గుతారని అన్నారు.
సహజ పద్ధతిలో సాగుచేయాల ను కున్న రైతులకు సాంకేతిక సాయం అందించాలని అధికారులకు సూ చించారు. ఈనెల 22 న నల్లగొండ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉ దయాదిత్య భవన్ లో సహజ వ్య వసాయంపై విజయరామ సహజ వ్యవసాయ నిపుణుల అవగా హ న శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామ న్నారు.
రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీని వాస్, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి ,జిల్లా వ్యవసా య అధికారి శ్రవణ్ కుమా ర్, ఆర్డీవో శ్రీదేవి ,జిల్లా అనంతరెడ్డి ఏడి వేణు గోపాల్ తదితరులు పా ల్గొన్నారు.
*ధాన్యం కొనుగోలు కేంద్రంలో క లెక్టర్ ఆకస్మిక తనిఖీ….* ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నాణ్యత ప్ర మాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెం టనే కొనుగోలు చేయాలని జిల్లా క లెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గు రువారం ఆమె మునుగోడులో ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి ధాన్యం కొనుగోలు పరి శీలించారు.
17 శాతం తేమతో, తాలు ,తరుగు లేకుండా. నాణ్యత ప్రమాణలతో వ చ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, జాప్యం చేయొద్దని, వ ర్షం కూడా లేనందున తేమను పరి శీలించి రైతులకు మేలు జరిగే వి ధంగా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చే శారు.
పి పి సిసెంటర్లో రైతులతో మాట్లా డుతూ ఏమైనా ఇబ్బందులు ఉ న్నాయా అని అడిగినారు. రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ఏ ఇబ్బంది లేవని చెప్పారు. పత్తి కొ నుగోళ్ల పై ఆమె మాట్లాడుతూ రై తులు 12 శాతం వరకు తేమ వ చ్చిన తర్వాత స్లాట్ బుక్ చేసు కో వాలని అప్పుడు పత్తి కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ అద న పు కలెక్టర్ జె. శ్రీనివాస్. జిల్లా గ్రా మీ ణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపికృష్ణ , జిల్లా పౌరసరఫరాల అధి కారి వెంకటేష్, జిల్లా సహకార అధి కారి పత్య నాయక్, ఆర్డీవో శ్రీదేవి, తహసిల్దార్ నరేష్, సెక్రెటరీ సుఖేం దర్ తదితరులు ఉన్నారు.

