Praja Deveena
Newspaper Banner
Date of Publish : 20 December 2025, 11:44 am Posted by : praja deveena

Collector Ila Tripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక వ్యాఖ్య, ఇక పై ఎరువుల కోసం రై తులు క్యూ‌లో నిలబడాల్సిన అవ సరం ఉండదు 

Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: రైతులకు అ వసరమైన యూరియా ఎరువులు సమయానికి, పారదర్శకంగా అం దించాలనే లక్ష్యంతో ఫర్టి లైజర్స్ యూరియా ఆన్లైన్ బుకింగ్ యాప్‌ ను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలో “మన గ్రోమోర్ కోరమండల్ ఇం టర్నేషన ల్ లిమిటెడ్ కంపెనీ” లో ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్ ప్రారం భించారు. ఈ యాప్ ద్వా రా రైతు లు తమకు అవసరమైన యూరి యాను ముందుగానే బుక్ చేసుకు ని, నేరుగా సమీప డీలర్ వద్ద పొం దే సౌకర్యం కల్పించబడిందని కలె క్టర్ తెలిపారు.

ఇకపై ఎరువుల కోసం రైతులు క్యూ‌ లో నిలబడాల్సిన అవసరం ఉండ దని, ఎరువుల అక్రమ నిల్వలు, ద ళారుల బెడద తగ్గుతుందని చెప్పా రు. యాప్‌లో నమోదు చేసిన వివ రాల ఆధారంగా యూరియా సరఫ రా ,పంపిణీలో పారదర్శకత పెరుగు తుందని, ప్రతి రైతుకు న్యాయంగా ఎరువులు అందుతాయని స్పష్టం చేశారు.రైతులు తమ మొబైల్ ఫోన్‌ లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆ ధార్, భూమి వివరాలతో ఎరువుల కై నమోదు చేసుకోవాలని చెప్పా రు.

వ్యవసాయ అధికారులు, డీలర్లు రై తులకు యాప్ వినియోగంపై అవ గాహన కల్పించాలని ఆదేశించారు. డిజిటల్ వ్యవస్థల ద్వారా వ్యవసా య రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, రై తులకు జిల్లా ,మండల స్థాయి లో ఎంత యూరియా డీలర్ల దగ్గర ఉ న్నదో ఈ యాప్ ద్వారా తెలుస్తుంద న్నారు.ఇది శాస్త్రీయమైన యాప్ అ ని, ఒక రైతుకు ఉన్న 5 ఎకరాల వ్య వసాయంలో ఎంతవరకు యూ రి యా అవసరామో ఈ యాప్ ద్వా రా ఇస్తారన్నారు.

ఈ యాప్ నిపుణులు తయారు చే శారని, చిన్న చిన్న మార్పు చేర్పులు అవసరమైనా, లేదా రైతులకు ఏమై నా సమస్యలుంటే ఏవో లేదా జెడి ఎ దృష్టికి తీసుకురావాలనికోరారు. ఈ ఆప్ వల్ల బోగస్ కంపెనీలు లే కుండా, బ్లాక్ మార్కెట్ జరగకుండా పారదర్శకంగా జరుగుతుంద న్నా రు. ఈ ఆప్ పట్ల రైతులు ఎలాంటి అపోహలు నమ్మవద్దని, వ్యవసా య శాఖ మంచి అడుగు వేసింద ని,అవసరమైతే రెవిన్యూ సిబ్బంది ని ఉపయోగించుకుంటామని తెలి పారు.ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ని రైతులు ఉపయోగించుకొని రా ష్ట్రoలో నల్లగొండ నెంబర్ వన్ స్థా నాన్ని పొందే విధంగా చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదన పు కలెక్టర్ జె. శ్రీనివాస్, వ్యవసా య శాఖ జెడి శ్రవణ్ కుమార్, మా ర్కెట్ కమిటీ చైర్మన్ జూకూరు శ్రీ ని వాస్,పి ఏ సి ఎస్ డైరెక్టర్ సంపత్ రె డ్డి, ఫెర్టిలైజర్ డీలర్లు, రైతులు పాల్గొ న్నారు.