Praja Deveena
Newspaper Banner
Date of Publish : 17 December 2025, 8:59 am Posted by : praja deveena

District Collector Ila Tripathi : మూడవ విడత ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన నల్లగొండ కలెక్టర్ 

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, దేవరకొండ: నల్లగొండ జిల్లాలో మూడవ విడత గ్రామపం చాయతీ ఎన్నికల పోలింగ్ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం నల్గొండ జిల్లా దేవ ర కొండ డివిజన్ పరిధిలోని దేవరకొం డ మండలం తాటికల్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పా టుచేసిన పోలింగ్ కేంద్రాన్ని సంద ర్శించారు.పోలింగ్ కోసం చేసిన ఏ ర్పాట్లు,బ్యారికేడింగ్,ఓటింగ్ కంపా ర్ట్మెంట్లు,హెల్ప్ డెస్క్, ఫస్ట్ ఎయిడ్ తదితర ఏర్పాట్లు పరిశీలించి అప్ప టివరకు పోలైన ఓట్లు,పోలింగ్ శా తం వివరాలను అడిగి తెలుసుకు న్నారు.

పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యా హ్నం 2 గంటలకు ఎట్టి పరిస్థితు లలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కా వాలని ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూ సుకోవాలని, కౌంటింగ్ ఏజెంట్లకు ముందే సమాచారం ఇచ్చారా ? అ ని ఆర్ ఓను అడిగి తెలుసుకు న్నా రు. మూడో విడత గ్రామపంచాయ తీ ఎన్నికలు జరుగుతున్న అన్ని కౌంటింగ్ కేంద్రాల పరిధిలో నిర్దేశిం చిన సమయం ప్రకారం మధ్యా హ్నం 2 గంటలకు ఎన్నికల కౌం టిం గ్ ప్రారంభం కావాలని, సాయంత్రం 5 లేదా 6 గంటల లోపు అన్నిచోట్ల కౌంటింగ్ పూర్తి చేసి ఫలితాలను ప్రకటించాలని డి పి ఓ ను ఆదే శిం చారు. ఫలితాల ప్రకటనలో జాప్యం చేయవద్దని ఆర్ ఓ లకు తెలిపారు.

సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసు లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఎక్క డ ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని చెప్పారు.కౌంటింగ్ కేంద్రంలోకి ఎన్నికల విధులు నిర్వ హించే వారు తప్ప ఇతరులెవ్వరిని అనుమతించవద్దని చెప్పారు. కౌం టింగ్,ఫలితాల వెల్లడి,అవసరమైతే రీకౌంటింగ్ నిర్ణయం పూర్తిగా స్టేజ్- 2 ఆర్ ఓ దేనని అన్నారు. కౌంటింగ్ సందర్బంగా ఎక్కడైనా శాంతి భద్ర తల సమస్య తలెత్తితే వెంటనే పో లీస్ లకు తెలియజేయాలన్నారు.

కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సి సి టి వి ల పర్యవేక్షణలో చేయాలన్నారు. కౌంటింగ్ సరళిని తనతో పాటు జి ల్లా ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర ఎ న్నికల సంఘం ఎప్పటికప్పుడు వె బ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షించడం జరుగుందన్నారు.రెవెన్యూ అదన పు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి ,జిల్లా పంచాయ తీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈ వో శ్రీనివాసరావు, దేవరకొండ తహ సిల్దార్ ,ఆర్ఓలు తదితరులు ఉ న్నారు.