Politicsతెలంగాణనల్గొండ

Eradication of Child Marriages : నల్లగొండ జిల్లా కలెక్టర్ అప్పీల్, బా ల్యవివాహాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి 

Eradication of Child Marriages : ప్రజా దీవెన, నల్లగొండ: బాలిక వి ద్యను ప్రోత్సహించడమే బాల్యవి వాహాలను అరికట్టేందుకు పరిష్కార మని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అ న్నారు. మంగళవారం ఆయన కలె క్టరేట్ ప్రాంగణంలో “ఆశ్రిత” స్వ చ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ శాఖ సహకారంతో బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజల్లో అ వగాహన పెంపొందించాలనే లక్ష్యం తో “జాగ్రత్త” పేరుతో రూపొం దించి న బాల్య వివాహాల విముక్తి ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించా రు.

దేశంలో ఆదర్శ భావాలు, అభివృద్ధి చెందుతున్న సమయంలో బాల్య వి వాహాలలాంటి సామాజిక రుగ్మత లు ఉండరాదని కలెక్టర్ అన్నారు. అమ్మాయికి 18 సంవత్సరాలు, అ బ్బాయికి 21 సంవత్సరాలు నిండక ముందే బాల్య వివాహాలు చేయడం చట్ట విరుద్ధమే కాక, నేరమని, ఈ చర్యలు బాలల భవిష్యత్తును దెబ్బ తీయడమే కాకుండా, వారి ఆరో గ్యం, విద్య, హక్కులపై తీవ్ర ప్రభా వం చూపుతాయని అన్నారు. బా ల్యవివాహాలు జరగకుండా ఉండా లంటే చదువు ఒకటే మార్గమని, వి ద్య పట్ల పిల్లలకు,తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, తల్లి దం డ్రులలో మార్పు రావాలన్నారు. బా ల్యా వివాహాల నిరోధక చట్టం ప్రకా రం బాల్య వివాహాలు నేరమని, ఎ వరు బాల్య వివాహాలు చేసిన కఠి న చర్యలు తప్పవని స్పష్టం చేశా రు.

తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో బా ధ్య తగా వ్యవహరించి బాల్యవివాహా లను అడ్డుకోవాలని కోరారు. బాల్య వివాహల నిర్మూలనకు రూపొందిం చిన ప్రచార రథం జిల్లా వ్యాప్తంగా గ్రామాలు , మండలాల్లో తిరుగుతూ పాటలు, నినాదాలు, పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుందని, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడి యా ద్వారా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపా రు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అ ధికారిణి కృష్ణవేణి, సీడీ పీవో హరి త,ఆశ్రిత స్వచ్చంధ సంస్థ డైరెక్టర్ నాగరాజు,గణేష్, చింతకృష్ణ, తది తరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button