Praja Deveena
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 12:25 pm Posted by : praja deveena

Nalgonda District Collector Chandra Shekhar: కార్యక్రమాల అమలులో అధికారు లు అప్రమత్తoగా ఉండాలి

 

Nalgonda District Collector Chandra Shekhar: ప్రజా దీవెన, నల్లగొండ: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అ మలు లో అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయి లో భాగస్వాములై జిల్లాను అభివృ ద్ధి పథంలో తీసుకు వెళ్లేందుకు కృషి చేయాలని జిల్లా కలె క్టర్ బి. చంద్రశే ఖర్ పిలుపునిచ్చారు. 2026 నూతన సంవత్సరా న్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన ను కలిసి నూతన సం వత్సర శుభాకాంక్షలు తెలిపిన అధి కారులు, సిబ్బంది, వివిధ ఉద్యోగ సంఘాలు,రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధు లతో ఆయన మాట్లాడారు.

జిల్లా అధికారులు జిల్లా, మండల, గ్రామస్థాయిలో అందరినీ సమ న్వయం చేసుకుంటూ అభివృద్ధి, సంక్షే మ పథకాలు ప్రజలకు చేరే లా అమలు చేయాలని కోరారు.పథకాల అ మలులో క్షేత్రస్థాయిలో అందరికీ న్యాయం జరిగేలా చూడాలని, అప్పుడే జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ అన్నారు.మిర్యాలగూడ సబ్ కలె క్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థా నిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి, జి ల్లా రవాణా కమి షనర్ వాణి, తదితరులు ఉన్నారు.

కాగా విద్యార్థులకు ఉపయోగపడే లా జిల్లా అధికారులు, సిబ్బంది, గజిటెడ్, టీఎన్జీవో, రెవెన్యూ సర్వీ సెస్, ట్రాన్స్పోర్ట్ తదితర సంఘా ల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కు నోట్ బుక్కులు, పెన్నులు, దుప్ప ట్లు, పూల మొక్కలు అందజేసి నూతన సం వత్సర శుభాకాంక్షలు తెలియజేశా రు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కేక్ ను కట్ చేశారు. అంతేకాక వివి ధ ఉద్యోగ సంఘాల నూతన సంవత్సర క్యాలెండ ర్లు, డైరీలు ఆవిష్కరించారు.


రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు చురుకుగా వ్యవహరించాలి

నల్లగొండ: రెవిన్యూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారు లు చురుకుగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అ న్నారు. నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీక రించిన తరువాత మొదటిసారి ఆయన శుక్రవారం తన చాంబర్లో రె వెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికా రుల పాత్ర ముఖ్యమని, ముఖ్యంగా ప్ర జావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యా దులకు ఖచ్చితమైన పరిష్కారం ఉండాలని, తరచువచ్చే ఫి ర్యాదులు తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫిర్యాదులను స్వీకరించ డమే కాకుండా, పిర్యాదుదారుకు రాశీదు ఇవ్వాలని, ఫి ర్యాదుల రిజిస్టర్లు, అన్ని వివరాలు కచ్చితంగా నిర్వహించాలని చె ప్పారు.


క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ ప థకాల అమలులో అవసర స మయాలలో రెవెన్యూ అధికారులు పూర్తిగా భాగస్వాములు కావా లని తెలిపారు. ప్రతినెల తప్పనిసరిగా తహసిల్దార్ ల సమావేశాన్ని నిర్వ హించడం జరుగుతుందని చెప్పా రు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భూ భారతి, పౌరసరఫరాలు తదిత ర అంశాలపై సమీక్షిం చారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీని వాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థ ల ఇంచార్జ్ అదనపు కలె క్టర్, ఆర్ డి ఓ అశోక్ రెడ్డి,దేవరకొండ ఆర్ డి ఓ రమణారెడ్డి తదిత రులు ఉన్నారు.

 

మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటరు జాబితాలు పునఃపరిశీలన

నల్లగొండ: మున్సిపాలిటీలలో వా ర్డుల వారీగా ప్రచురించిన ముసా యిదా ఓటరు జాబితాను పునఃప రిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఆ యన తన చాంబర్ లో స్థాని క సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మున్సిపల్ క మిషనర్ల తో సమావేశం నిర్వహించారు.

ఓటరు జాబితాలో ఏలాంటి తప్పు లు లేకుండా నూటికి నూరు శా తం పారదర్శకంగా ఉండాలని, అందువ ల్ల ఈ నెల 1న మున్సిపల్ వార్డుల వారిగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాను ము న్సిపల్ కమిషనర్లు, బిఎల్ ఓలు, వార్డ్ ఆఫీసర్లు పునఃపరిశీలన చే యాలని చెప్పారు. ప్రస్తుతం ప్రచురించిన ఓటరు జాబితా ఈసీఐ ఆదేశాలకు మేరకు తయారు చేసిన ఓటరు జాబితాలో పురుష, మ హిళ ఓటర్లు సరిపోయేలా ఉండాలని అన్నారు. ఆయా వార్డుల వా రిగా రూపొందించిన ఓటరు జాబితాలో ఓటర్ల వివరాలు ఇంటి నెం బర్ల ప్రకారం ఉన్నాయో లేదో చూడాలన్నారు.

ఒక వార్డులోని కుటుంబ సభ్యులు అదే వార్డులో ఉండేలా చూడాల ని, ఒక వార్డులో నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ ఓటర్లు లేకుం డా చూడాలని, మున్సిపల్ ఎన్నికల సంద ర్భంగా గుర్తించిన రిట ర్నింగ్ అధికారులు చురుకుగా, పూర్తి అవగాహన తో ఉండేవారిని ఎంపిక చేయాల ని, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అవసర మైన ఇండెలిబుల్ ఇంక్ కొనుగోలుకు చర్యలు తీసు కోవాలని, ప్రస్తు తమున్న ఓటరు జా బితాలో ఎట్టి పరిస్థితులలో సవరణకు అవకా శం లేదన్న విషయాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన వెల్లడించారు.

మున్సిపాలిటీలలో ప్రచురించిన ఓ టరు జాబితా పై ఈనెల 5 వ రకు అభ్యంతరాలను స్వీకరించాలని క లెక్టర్ సూచించారు. ఓటరు జా బి తాకు సంబంధించి మున్సిపాలి టీ లలో హెల్ప్ డెస్క్ ఏర్పా టు చేయాలని సూచించారు.