Praja Deveena
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 6:38 am Posted by : praja deveena

District Collector Chandrashekhar : నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీల్, కొత్తగాఎన్నికైన గ్రామస ర్పంచులు మెరుగైనపాలన అందిం చాలి 

District Collector Chandrashekhar : ప్రజా దీవెన నల్లగొండ: నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు ప్రజల కు మెరుగైన పాలన అందించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరా రు. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కొత్తగా ఎ న్నికైన గ్రామపంచాయతీ సర్పంచ్ లకు ఉద్దేశించి సోమవారం నుండి ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తున్న శి క్షణ కార్యక్రమాల్లో భాగంగా మొద టి విడత శిక్షణ కార్యక్రమాన్ని సోమ వారం అయన నల్లగొండ జిల్లా కేం ద్రం సమీపంలోని టీటీడీసీలో జ్యో తి వెలిగించి ప్రారంభించారు.

మొదటి విడత శిక్షణను నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాలలోని మండలాలు, అలాగే తుంగతుర్తి ని యోజకవర్గంలోని శాలిగౌరారం మండల సర్పంచ్ లకు 5 రోజుల పా టు ఇవ్వనున్నారు.ముందుగా జిల్లా కలెక్టర్ నూతన సర్పంచులకు శుభా కాంక్షలు తెలియజేశారు.

అనంతరం మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజలు స ర్పంచులకు కల్పించిన ఒక గొప్ప అ వకాశం అని అన్నారు. మహాత్మా గాంధీ చెప్పినట్లు గ్రామాలు అభివృ ద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందు తుందని అన్నారు. గ్రామాలలో ప్ర జాసమస్యలు తీర్చడంలో,ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం లో సర్పంచులది కీలకపాత్ర అని అ న్నారు. చట్టపరంగా సర్పంచుల హ క్కులు, బాధ్యతలు, వివిధ ప్రభు త్వ పథకాల వివరాలు సమగ్రంగా తెలుసుకొని ప్రజలకు సుపరిపాలన అందించాలని నూతన సర్పంచ్ ల తో కోరారు.

5 రోజుల శిక్షణా కార్యక్రమంలో అ న్ని విషయాలను క్షుణ్ణంగా చర్చించ డం జరుగుతుందన్నారు. సర్పంచు లు మంచి నడవడికతో ప్రజా సమ స్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారికి దక్కిన పదవి కాలాన్ని సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ,ఆర్ డి ఓ అశోక్ రెడ్డి మా ట్లాడారు. డిప్యూటీ కమిషనర్ కె. అనిల్ కుమార్, హైదరాబాద్ ట్రై నింగ్ సెంటర్ హెడ్ డి. రా ఘవేంద్ర రావు, డిపిఓ శంకర్ నాయక్, జెడ్పి సీఈవో శ్రీనివాస రావు, డిఆర్డిఓ శే ఖర్ రెడ్డి, విశ్రాంత ఐ ఏ ఎస్ అధి కా రి చోల్లేటి ప్రభాకర్, తదితరులు ఉ న్నారు.