District Collector Ila Tripathi : డిండి ఎంపీడీవో ఆఫీసులో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ,ఎన్ ఎఫ్ బిఎస్ దరఖాస్తుల పరిశీలన
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, డిండి: జాతీయ కు టుంబ ప్రయోజన పథకం కింద అ ర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చే సుకోవాలని జిల్లా కలె క్టర్ ఇలా త్రి పాఠి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వా రా ఆసరా పెన్షన్ లాంటివి వస్తున్న ప్పటికీ ఈ పథకానికి అర్హులని తెలి పారు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ద్వా రా అమలు చేసే ఈ పథకం కింద ఒ కేసారి 20 వేల రూపాయల ఆర్థిక స హాయం అందుతుందని చెప్పారు. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా గుండ్లపల్లి (డిండి) ఎంపీడీవో కా ర్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శిం చారు.
రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ స్టేషన్లపై సమీ క్షించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వారిగా మౌలిక వసతులు,ఓటర్లు మండలంలో ఉన్న పోలింగ్ కేంద్రా లు, ఉన్న ఓటర్ల సంఖ్య ఆధారంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయా లని ఆదేశించారు.
జాతీయ కుటుంబ ప్రయోజన పథ కంపై తహసిల్దార్ శ్రీనివాస్ తో మా ట్లాడుతూ జాతీయ కుటుంబ ప్ర యోజన పథకం దరఖాస్తులన్నింటి ని విచారణ చేసి త్వరితగతిన ఆ ర్డీవో కు పంపించాలని చెప్పారు. అనంతరం మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాల యాన్ని సందర్శించి వంటగదిని, డై నింగ్, పరిసరాలను తరగతి గ దు లను తనిఖీ చేశారు.
తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినిల తో ముఖాముఖి మాట్లాడుతూ వి విధ కూరగాయలు, ఆకుకూరల వల్ల కలిగే ప్రయోజనాల పై వారికి అవగాహన కల్పించారు. పాఠశాల ఆవరణ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీ డియా ప్రతినిధులతో మాట్లాడుతూ జాతీయ కుటుంబ ప్రయోజనం ని రంతరం కొనసాగే ప్రక్రియ అని, అ యితే గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ఈ పథకం కింద సరైన దర ఖాస్తులు రానందున నల్గొండ జి ల్లా లో ప్రత్యేకంగా డ్రైవ్ లా నిర్వహించి అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందు కు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఏప్రిల్ 1,2017 నుండి ఇప్పటివ ర కు కుటుంబ పెద్ద మరణించి ఉంటే ఆ కుటుంబానికి ఒకేసారి 20 వేల రూపాయల ఆర్థిక సహాయం జాతీ య కుటుంబ ప్రయోజన పథకం కిం ద అందుతుందని తెలిపారు. అం దువల్ల అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఈ పథకానికి దరఖా స్తు చేసుకోవాలని కోరారు. తహసి ల్దారులు వారికి వ చ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి ఆర్డీవోలకు పంపించాల ని చెప్పారు. దేవరకొండ ఆర్డీవో ర మణారెడ్డి, ఎంపీడీవో ఎస్ టి వెం కన్న ,కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్, త దితరులు ఉన్నారు.