District Collector Ila Tripathi : మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి లో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
District Collector Ila Tripathi : ప్రజా దీవెన మిర్యాలగూడ: మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తిచేసి వినియో గంలో తీసుకొచ్చేలా చర్యలు తీసు కోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆసుపత్రి అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. మిర్యాలగూడ ఆ స్పత్రికి 160 కే.వి జనరేటర్ మంజూ రైనందున రెండు నెలల్లో జనరేటర్ ను ఆసుపత్రిలో నెలకొల్పే ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ కర్త డాక్టర్ మాతృ నాయక్ లను ఆదేశించారు .అలాగే ఆసుపత్రి స్థా యి వంద పడకల నుండి200 కు పెరిగినందున ఏడుగురు అదనపు సానిటేషన్ సిబ్బంది ఆసుపత్రికి మంజూరు కాగా, వారిని నియ మించుకోవాలని సూచించారు. సో మవారం ఆమె మిర్యాలగూడ శాస నసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డితో కలి సి మిర్యాలగూడ ఏరియా ఆసుప త్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నూతన ఆసుపత్రి భవన నిర్మాణా న్ని పరిశీలించారు. ఆసుపత్రిలో రి కార్డులను తనిఖీ చేశారు. డాక్టర్లు, సిబ్బంది, ఓపిరిజిస్టర్ లను పరిశీ లించి డాక్టర్లతో మాట్లాడారు. ఆస్ప త్రికి వస్తున్న డయాలసిస్ పేషెంట్లు, నిర్వహిస్తున్న సర్జరీలు, ఆసుపత్రి లో ఇబ్బందులు, తదితర అంశాల ను అడిగి తెలుసుకున్నారు. నూత న భవన నిర్మాణంలో భాగంగా పెం డింగ్ లో ఉన్న 4 కోట్ల 50 లక్షల రూ పాయల బిల్లులను త్వరగా మం జూరు చేసేందుకు చర్యలు తీసు కుంటామని, అందుకు సంబంధించి న వివరాలను సమర్పించాలని ఆ మె తెలిపారు.
రోగులు వచ్చినప్పుడు కాజువా లిటీలో డాక్టర్లు అందరూ అందు బాటులో ఉండేలా చూడాలని, ఆ సుపత్రి ద్వారా ఇంకా మెరుగైన వై ద్య సేవలు అందించేందుకు డాక్ట ర్లతోపాటు, సిబ్బంది కృ షి చేయా లని అన్నారు.
కాగా జిల్లా ఆసుపత్రుల సేవల స మన్వయకర్త డాక్టర్ మాతృనాయ క్ మాట్లాడుతూ మిర్యాలగూడ ఏ రియా ఆసుపత్రిలో గత నెల 250 సర్జరీలు నిర్వహించడం జరిగిందని, దీంతోపాటు, 20 మేజర్ సర్జరీలు చే శామని ,మోకాలు చిప్పల మార్పిడి, హిప్ మార్పిడి చికిత్సలు 20 వరకు నిర్వహించడం జరిగిందని, వివిధ అంశాలలో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి రాష్ట్రంలోనే ముందుంద ని, అంతేకాక “లక్ష్య” పథకానికి కూ డా ఈ ఆసుపత్రి ఎంపికైనట్లు తెలి పారు.
ఆస్పత్రి వైద్యులతో జిల్లా కలెక్టర్ సమావేశమై ఆసుపత్రి ద్వారా అం దించాల్సిన మెరుగైన వైద్య సేవల పై చర్చించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఏరి యా ఆసుపత్రి సూపరింటిండెంట్, ఆసుపత్రి డాక్టర్లు తదితరులు ఉ న్నారు.