Praja Deveena
Newspaper Banner
Date of Publish : 30 October 2025, 3:32 pm Posted by : praja deveena

Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా తిప్పర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇ లా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవా ర్ ఆకస్మికంగా తనిఖీ 

Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా తిప్పర్తి మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో టా ర్పాలిన్లు,లారీల ఏర్పాటులో నిర్ల క్ష్యం వహించినందుకు గాను ధా న్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జికి షో కాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి తిప్పర్తి మా ర్కెట్ యార్డులోని ధాన్యం కొను గోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనకి చేశారు. తుఫాను కారణంగా గత రెండు, మూడు రోజులు గా వర్షం వల్ల కొనుగోలు కేంద్రంలోని ధా న్యం తడిసిపోయింది. కొంత మంది రైతులనుండి ధాన్యం కొన్నప్పటికి సకాలంలో లారీ రాకపోవటం, టా ర్పాలిన్లు లేకపోవడంతో ధాన్యం త డిసి పోయింది. సెంటర్ ఇన్చార్జి తమకు టార్పాలిన్లు ఇవ్వలేదని, కొన్న ధాన్యాన్ని తరలించేందుకు లారీలు ఏర్పాటు చేయలేదని రైతులు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసారు. ఈ విషయంపై ఆగ్ర హిం చిన కలెక్టర్ కొనుగోలు కేంద్రం నిర్వ హణలో నిర్లక్ష్యం వహించినం దుకు గాను కేంద్రం ఇంచార్జ్ కి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించా రు.

ధాన్యంకొనుగోలు కేంద్రాల పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని, దీనివల్ల ధాన్యం తడిసిపోయి రైతులు ఇ బ్బందులు పడతారని, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠి న చర్యలు తప్పవని హెచ్చరించా రు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీని వాస్, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రె డ్డి , డి ఎస్ ఓ వెంకటేష్, పౌరసర ఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ , మార్కెటింగ్ ఏడి ఛాయాదేవి, డిసి సిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి ఉన్నారు.

*మాడుగులపల్లి లో కలెక్టర్, ఎ స్పీ ఆకస్మిక తనిఖీ…* వర్షానికి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించారు. గురు వారం ఆమె జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తో కలిసి నల్గొండ జిల్లా మా డుగుల పల్లి మండలం చిరుమర్తి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏ ర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కాగా మొంథా తుఫాను కారణంగా గడచిన రెండు రోజులుగా కురుస్తు న్న వర్షాలకు ఐకెపి కేంద్రంలోని ధా న్యం తడిసి రంగు మారిపోగా ధా న్యం కొనుగోలు విషయంలో చిరు మర్తి కొనుగోలు కేంద్రానికి అనుసం ధానం చేసిన రైస్ మిల్లుతో సమ న్వయం చేసుకుని ధాన్యం దించు కునేలా చూడాలని డిఆర్ డిఓ శేఖ ర్ రెడ్డి కి సూచించారు. ఎక్కువ రో జులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంచవద్దని, వర్షాలను దృష్టిలో ఉం చుకొని దాన్యం తడవకుండా టా ర్పాలిన్లు కప్పి ఉంచాలని చెప్పారు.

టార్పాలిన్లు,లారీల సమస్య లే కుండా ముందే చూసుకోవాలన్నా రు. నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యం వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించే ఏర్పాటు చే యాలని ఆదేశించారు. అయితే ఈ కేంద్రంలో కేవలం నలుగురు రైతు లకు చెందిన ధాన్యం మాత్రమే వ ర్షానికి తడిసిపోయి రంగుమారి పో యినట్లు డిఆర్డిఓ శేఖర్ రెడ్డి జి ల్లా కలెక్టర్ కు వివరించారు. కొను గో లు కేంద్రాలలో వర్షానికి ధాన్యం త డవకుండా అవసరమైన అన్ని చ ర్యలు తీసుకోవాలని ఈ సంద ర్భం గా కలెక్టర్ ఆదేశించారు. రెవె న్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, డి ఎస్ఓ వెంకతేష్, పౌరసరఫరాల డి ఎం గోపికృష్ణ, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.