Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda District Collector Ila Tripathi: రక్తహీనతతో రకరకాల అనారోగ్య సమస్యలు

–తప్పనిసరిగా ఐరన్ ఫోలిక్ మాత్ర లు తీసుకోవాలి
–మేనరిక వివాహాలు, మూఢనమ్మ కాల వల్ల అసాధారణ పిల్లలు జన్మి స్తున్నారు
–దేవరకొండ ప్రాంతంలో పిల్లల్లో సరై న ఎదుగుదల లేని సమస్యలు
— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Nalgonda District Collector Ila Tripathi: ప్రజా దీవెన దేవరకొండ: రక్తహీనత వల్ల మహిళలు వివిధ రకాల జబ్బు లకు గురయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల తప్పనిసరిగా ఐరన్ ఫో లిక్ మాత్రలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. నల్ల గొండ జిల్లాలోని దేవరకొండ, నేరే డుగొమ్ము, చందంపేట తదితర గిరి జన ప్రాంతాలలో అవగాహన లో పం, మేనరిక వివాహాలు, మూఢన మ్మకాల వల్ల అసాధారణ పిల్లలు జ న్మిస్తున్నారని,అలాగే జన్యు లోపం, సరైన చికిత్స తీసుకోకపోవడం వం టి కారణాల వల్ల పిల్లల్లో అసాధా రణ లోపాలు,సరైన ఎదుగుదల లేకపోవడం, వంటి అనారోగ్య స మస్యలు తాము గుర్తించడం జరి గిందన్నారు. అందువల్ల పెళ్లైన మ హిళలు గర్భం దాల్చే ముందే తప్ప నిసరిగా ఐరన్ ఫోలిక్ మాత్రలు తీ సుకోవాలని అలాగే యుక్తవయస్సు బాలికల తో సహా రక్తహీనతను ని రోధించేందుకు ఐరన్ ఫోలిక్ మాత్ర లు వాడాలని కోరారు. మంగళవా రం ఆమె నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్ నేరేడు గొమ్ము మండలం చెంచు కాలనీని సందర్శించారు. ముందుగా చెంచు కాలనీలోని ప్ర భుత్వ గిరిజన ప్రాథమిక పాఠశా లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఉన్న విద్యార్థులు, సౌ కర్యాలు, యూనిఫామ్,బుక్కుల పంపిణీ, తదితర వివరాలను అడి గి తెలుసుకున్నారు. పాఠశాలకుఏం కావాలో మంజూరు చేసేందుకు సి ద్ధంగా ఉన్నామని తెలిపారు. విద్యా ర్థులతో ముఖాముఖి మాట్లాడి వా రి రాత సామర్థ్యాలను తెలుసుకొ న్నారు. సరైన విధంగా రాసిన వా రికి చాక్లెట్లు పంపిణీ చేశారు.

అనంతరం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ,ప్రత్యేకించి మారుమూ ల గిరిజన ప్రాంతాలలో పాఠశాలలు నిరంతరం నడవాలని, ఎట్టి పరిస్థి తుల్లోనూ మూయకూడదని, అవ సరమైతే ఉపనియామకం పై ఉపా ధ్యాయులను నియమిస్తామని చె ప్పారు. కాగా ప్రస్తుతం ఉన్న ప్రభు త్వ గిరిజన ప్రాథమిక పాఠశాల పె చ్చులూడిపోయే దశలో ఉందని, వంటగది లేదని, మరో టీచర్ కావా లని గ్రామస్తులు కోరగా, పాఠశాల లో విద్యార్థుల నమోదు పెంచాలని, కనీసం 40 మంది ఉండేలా చూసు కోవాలని కలెక్టర్ సూచించారు.

అనంతరం గ్రామస్తులతో జిల్లా కలె క్టర్ ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా చెంచుకాలనీ మహిళ లతో మాట్లాడుతూ ప్రసవాలకు ఎ క్కడకు వెళుతున్నారని అడిగి తెలు సుకున్నారు. ఈ ప్రాంతంలో శిశుమ రణాలు ఎన్ని జరిగాయని డాక్టర్ చందూలాల్ ను అడిగి తెలుసుకు న్నారు. అసాధారణ పిల్లలు జన్మిం చకుండా ఉండాలంటే మేనరిక వి వాహాలు చేసుకోవద్దని, మూఢ న మ్మకాలు పాటించవద్దని, ఎప్పటిక ప్పుడు పరీక్షలు చేయించుకోవాల ని,మహిళలు తప్పనిసరిగా ఐరన్ ఫోలిక్ మాత్రలువాడాలని రక్తహీన త ద్వారా వచ్చే వ్యాధుల పట్ల మ హిళలు అప్రమత్తంగా ఉండాలని కో రారు. చెంచు కాలనీకి 13 ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేయడం జరి గిందని, లబ్ధిదారులు 30 రోజుల్లో నిర్మాణం ప్రారంభించాలని చెప్పా రు. అదేవిధంగా కాలనీకి మంజూ రైన అంగ న్వాడి భవనాన్ని నాణ్య తతో నిర్మిం చాలని అధికారులను ఆదే శించారు.

దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, గృ హనిర్మాణ శాఖ పిడి రాజ్ కు మా ర్,డిటీడీవో చత్రునాయక్, డిప్యూ టీ డిఎంహెచ్ ఓ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, తహసిల్దార్ ఉమాదేవి, ఎంపీడీవో నీలిమ, ఎంఈఓ ర ఘు తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.