Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీలు, పీహెచ్ సీ, రెసి డెన్షియల్ పాఠశాలల్లో ముఖాముఖి 

Nalgonda District Collector Ila Tripathi :

ప్రజా దీవెన దేవరకొండ: గ్రామీణ ప్రాంత ప్రజలలో కుటుంబ నియం త్రణ పట్ల అవగాహన కల్పిం చాల ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పా రు.శనివారం ఆమె నల్గొండ జిల్లా దే వరకొండ డివిజన్ పరిధిలోని దేవర కొండ మండలం బొడ్డుపల్లి ప్రాథమి క వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆ కస్మికం గా తనిఖీ చేశారు. ఓపిరిజిస్టర్, ఏఎ న్ సీ,ఈడిడి,హై రిస్క్ రిజిస్టర్లు, ఐర న్ ఫోలిక్ మాత్రల పంపిణీ, డెలివరీ లు, సీజనల్ వ్యాధుల వివరాలను పరిశీలించదమే కాకుండా డాక్టర్ తో అడిగి తెలుసుకున్నారు.

కాగా శనివారం 65 మంది ఔట్ పే షెంట్లు పి హెచ్ సి కి వచ్చారు. సీజ నల్ వ్యాధులతో వస్తున్న వారి వివ రాలను డాక్టర్ విజయతో అడిగి తె లుసుకున్నారు. పి హెచ్ సి ల ద్వా రా సాధారణ ప్రసవాలు అయ్యేలా చూడాలని చెప్పారు. గర్భిణీ స్త్రీలు సకాలంలో వైద్య పరీక్షలు చేయిం చుకోవడమే కాకుండా, పౌష్టికాహా రం తీసుకునేలా చూడాలన్నారు. ఈ డి డి క్యాలెండర్ ను తు. చ తప్పకుండా పాటించాలని ఆదేశిం చారు.

దేవరకొండ లాంటి మారుమూల గి రిజన ప్రాంతాలలో ప్రజలు అవగా హన లోపంవల్ల కుటుంబ నియం త్రణ పద్ధతులు పాటించరని, అం దువల్ల వారికి కుటుంబ నియంత్రణ పద్ధతుల పై అవగాహన కల్పించా లని తెలిపారు.అనంతరం జిల్లా కలె క్టర్ ఇదే మండలం ముదిగొండ ప్రభు త్వ గిరిజన ఆశ్రమ బాలికల రెసిడె న్సియల్ పాఠశాల, కళాశాలను ఆ కస్మికంగా తనిఖీ చేశారు. వంటగ ది, డైనింగ్ లను పరిశీలించగా, కిచె న్ లో నుండి వెళ్లే వృధా నీరు ఓపెన్ డ్రైనేజీ ఉండడం, అంతేకాక వాష్ రూమ్ ల ద్వారా బయటకు వెళ్లే మురుగునీరు ఓపెన్ డ్రైనేజీ ఉం డడం పట్ల అసహనం వ్యక్తం చేశా రు.

ఓపెన్ డ్రైనేజ్ వల్ల విద్యార్థులకు ఇ బ్బంది కలాగాకుండా చూడాలని ప్రి న్సిపల్ హనుమకుమారిని ఆదేశిం చారు.అనంతరం జిల్లా కలెక్టర్ వి ద్యార్థులతో ముఖముఖి మాట్లాడు తూ చరిత్ర ,భౌగోళిక శాస్త్రం, జనర ల్ నాలెడ్జి సబ్జెక్టులపై పలు విషయా లను అడిగి సమాధానాలను రాబ ట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యా ర్థినిలకు చాక్లెట్లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ వెంట దేవర కొండ ఆర్ డివో రమణారెడ్డి తది తరులు ఉన్నారు.