— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Nalgonda District Collector Ila Tripathi: ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ప్రభు త్వ ఆదేశాల మేరకు ఈ నెల 10 నుండి 17 వరకు “అమ్మ మాట అం గన్వాడి బాట” కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వ హిం చాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో ఆదేశించారు. ఈ సందర్భంగా 3 సంవత్సరా లలోపు పిల్లలను బడిలో చేర్పించే కార్యక్ర మంలో గ్రామ పంచాయతీలు, గ్రా మ ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు.
ఈనెల 10 న “అమ్మ మాట అంగ న్వాడి బాట” ప్రారంభానికి అవసర మైన అన్ని ఏర్పాట్లను చేయాలని ఆమె జిల్లా సంక్షేమ అధికారిని, అం గన్వాడీ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులతో పాటు, గ్రామ పెద్ద లు అందర్నీ భాగస్వాములను చే యాలని చెప్పారు. అంగన్వాడీ ఆవరణలను శుభ్రంగా ఉంచుకోవ డం, అనవసరమైన సామాగ్రిని తొ లగించడం, చెత్తా,చెదారం తీసేసి పిల్లలు సంతోషంగా అంగన్వాడీలో చేరేలా తల్లుల కమిటీలు, స్వయం సహాయక సంఘాలతో గ్రామంలో తిరగాలని,అంగన్వాడీ ద్వారా
అందించే సేవల గురించి తెలియ జేయాలన్నారు.
రోజువారీ కార్యక్రమాల పై జిల్లా కలె క్టర్ తెలియజేస్తూ 10న అంగన్వా డీలను అలంకరించాలని , తల్లిదం డ్రులు పిల్లలతో సెల్ఫీ దిగడం, అంగ న్వాడీ స్థాయిలో తల్లుల కమిటీలు, గ్రామైక్య సంఘాలు, మహిళా స్వ యం సహాయక సంఘాలు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి పండగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని,11 వ తేదీన ఇల్లిల్లు తిరిగి పూర్వ పాఠశాల వి ద్య పిల్లలను గుర్తించి తల్లిదండ్రు లకు పాఠశాల పూర్వ విద్య గు రించి, అంగన్వాడీ కార్యక్రమాల గురించి, కాలపట్టిక ,అన్ని విషయా లను తెలియ చేయాలని, పిల్లల్ని అంగన్వాడీలో చేర్చుకోవాలని ,
పాఠశాల పూర్వ విద్య పూర్తిచేసిన పిల్లలకు సర్టిఫికెట్లు ప్రదానం చేయా లని, ఐదు సంవత్సరాల పైబడిన పిల్లల్ని ప్రాథమిక పాఠశాలలో చే ర్పించాలని తెలిపారు.
ఈ నెల 12 నుండి 16 వరకు అన్నీ అంగన్వాడీ కేంద్రాల పరిధిలో పో షన్ కిచెన్ గార్డెన్ ల అభివృద్ధి, పౌ ష్టికాహార ప్రాముఖ్యత తెలియజే యాలని, అభ్యసన కేంద్రాలకు గు ర్తింపు, అందుకు తగ్గ మెటీరియల్ను సంసిద్ధం చేసుకోవడం, పిల్లల సంర క్షణ వంటివి చేపట్టాలన్నారు.
ఈ నెల 17న సామూహిక అక్ష రాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిం చాలని, పాఠశాల పూర్వ విద్య ప్రా ముఖ్యతను మరోసారి అందరికీ తెలియజేయాలని, ఇందుకు సం బంధించి అంగన్వాడీల ద్వారా అం దించే పుస్తకాలు, అసెస్మెంట్ కార్డు లు ప్రదర్శించాలని, తల్లిదండ్రులతో పాటు,తాతలు,అమ్మమ్మలు,నానమ్మలు అందర్నీ పిలవాలని, గ్రామ పెద్దలను గ్రామంలోని ప్రజలను ఇం దులో భాగస్వాములు చేయాలని, ఆరోగ్యంగా ఉన్న పిల్లల తల్లిదండ్రు లకు అవార్డు ఇవ్వాలని, సామూహి క అక్షరాభ్యాస కార్యక్ర మాన్ని చేప ట్టాలని ఆమె ఆదేశించారు.