–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Nalgonda District Collector Ila Tripathi: ప్రజాదీవెన, నల్లగొండ: జాతీయ కుటుంబ ప్రయోజన పథ కం కింద అర్హులైన లబ్ధిదారుల జా బితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.సోమవారం ఆమె కలె క్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జాతీయ కుటుంబ ప్ర యోజన పథకంపై సమీక్షించారు.
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హులైన వారికి లబ్ది చేకూర్చేందుకుగాను రాష్ట్ర ప్రభు త్వం జిల్లాల వారీగా పంపించిన రైతు ఆత్మహత్యల జాబితా మరి యు ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వా రా వచ్చిన వితంతు పెన్షన్ కుటుం బాల జాబితా ఆధారంగా జాతీ య కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హుల జాబితాను రూపొం దించాలన్నారు.
జాతీయ కుటుంబ ప్రయోజన ప థకం కింద లబ్ధి పొందేందుకు సం బంధిత తహసిల్దార్ కి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని, దర ఖాస్తు తో పాటు, ఆధార్ కార్డు, కు టుంబ సభ్యుల ధ్రువ పత్రం, మర ణ దృవీకరణ పత్రం, బ్యాంకు పాసు బుక్ జిరాక్స్, సహజమరణమా లే క ప్రమాద వశాత్తు సంభవించిన మరణమా అని తెలిపే అఫిడవిట్, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీ, ఐకెపి ద్వారా ఏ ఏ బి వై, జె బి వైకి సంబంధించి నిర భ్యం తర ధ్రువీకరణ పత్రం సమర్పించా ల్సి ఉంటుందని తెలిపారు.
తహసిల్దారు ఈ దరఖాస్తు పై విచా రణ నిర్వహించిన అనంతరం ఆర్డీ వో కు సమర్పించాలని, ఆర్డిఓ జిల్లా రెవెన్యూ అధికారికి ,డి ఆర్ ఓ ద్వా రా డైరెక్టర్ ఎస్ ఎస్, సెర్ప్ సీఈవో కు ఆన్లైన్ ద్వారా పంపడం జరుగు తుందని తెలిపారు. అదనపు కలె క్టర్ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ను గుర్తించడంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించి నట్లు ఆమె తెలిపారు.