Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం,ప్రత్యామ్నాయ పద్ధతిలో ట్యాంకర్లతో నీటిని సరఫరాకు ఆదేశం
Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ : నల్లగొండ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వ ర్షం కారణంగా దేవరకొండ డివిజన్, డిండి మండలం, కందుకూరు వాగు లో మిషన్ భగీరథ పైప్ లైన్లు దెబ్బ తినగా నీటి సరఫరా నిలిచిపోయిన గ్రామాలకు ప్రత్యామ్నాయ పద్ధతి లో ట్యాంకర్లు, బోర్ల ద్వారా తాగు నీ టిని సరఫరా చేయాలని జిల్లా క లె క్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మం గళవారం ఆమె కందుకూరు వాగు లో దెబ్బతిన్న మిషన్ భగీరథ పైప్ లైన్ స్థలాన్ని పరిశీలించారు. మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా అధికారులతో సమస్యను అడిగి తెలుసుకున్నా రు.
చందంపేట, దిండి మండలాల లోని 92 గ్రామాలకు తాగు నీటిని సరఫ రా చేసే మిషన్ భగీరథ పైప్ లైన్ భారీ వర్షాల కారణంగా దెబ్బతి న్న దని, అందువల్ల చందంపేట, డిం డి మండలాలలోని గ్రామాలకు తా గు నీటి సరఫరా నిలిచిపోయిందని, నీ టి ప్రవాహం తగ్గిన వెంటనే పైపు లై న్లను పునరుద్ధరిస్తామని మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీ నారాయణ జిల్లా కలెక్టర్ కు వివ రించారు. వాగులో వరద నీరు తగ్గి న వెంటనే పైప్ లైన్లను పునరుద్ధరిం చాలని, అప్పటివరకు ప్రజలు ఇ బ్బందులకు గురి కాకుండా తాగునీ టి ట్యాంకర్లు, బోర్ల ద్వారా తాగునీ టిని సరఫరా చేయాలని దేవరకొండ ఆర్డిఓ ను ఆదేశించారు. పైప్ లైన్ ల మరమ్మతు, పునరుద్ధరణకు తీ సుకునే సమయం, పై నుండి నీటి ప్రవాహం, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ డిండి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య ఆ రోగ్య కేంద్రం డాక్టర్ హరికృష్ణతో ఆ రోగ్య కేంద్రానికి వస్తున్న రోగులు, సీ జనల్ వ్యాధులు, ఓపి, తదితర వి వరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డా క్టర్లు తప్పనిసరిగా వారి పరిధిలోని పాఠశాలలను, అంగన్వాడి కేంద్రాల ను సందర్శించి పిల్లలకు వైద్య పరీ క్షలు నిర్వహించాలని ఆదేశించారు
వైద్య ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది తక్కువగా ఉన్నారని, సిబ్బందిని కేటాయించాలని డాక్టర్ హరికృష్ణ జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
ఇందుకు జిల్లా కలెక్టర్ సానుకూ లం గా స్పందించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం చుట్టుపక్కల ఉన్న ముళ్ళపోదలు, చెట్లను తొలగించా లని ఎంపీడీవోను,తహసీల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు . ఈ సంద ర్భం గా కలెక్టర్ పేషెంట్లతో మాట్లాడు తూ వివరాలను అడిగి తెలుసుకు న్నారు. అంతకు ముందు జిల్లా కలె క్టర్ ఐటిఐ ని సందర్శించి భవన ని ర్మాణం, ఫ్లోరింగ్ పరిశీలించారు.
లీకేజీలు కాకుండా అన్ని చర్యలు తీ సుకోవాలని కాంట్రాక్టర్ ను ఆదేశిం చారు.దేవరకొండ ఆర్ డిఓరమ ణా రెడ్డి, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు లక్ష్మీనారాయణ, మ హమ్మద్ అక్తర్,నగేష్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.