Praja Deveena
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 1:09 pm Posted by : praja deveena

District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, హెచ్చరిక, ధాన్యం కొనుగోళ్లలో మి ల్లర్లు ఎలాంటి సమస్యలు సృష్టిం చొద్దు 

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: రైతులు వి డతలవారీగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా అ వగాహన కల్పించాలని జిల్లా కలె క్ట ర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళ వారం ఆమె కలెక్టర్ కా ర్యాలయం లోని సమావేశమందిరంలో ధాన్యం సేకరణపై సంబంధిత శాఖల అధికా రులు, మిల్లర్లతో సమావేశం నిర్వ హించారు.గత సంవత్సరంతో పో లిస్తే ఈ సంవత్సరం ఆకాలవర్షాలు సవాల్ గా మారాయని, ఒకేసారి రై తులు కొనుగోలు కేంద్రాలకు మిల్లు లకు ధాన్యం తీసుకు రావడం వల్ల ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉం దని, అలా కాకుండా విడతల వారీ గా ధాన్యాన్ని తీసుకు వచ్చినట్లయి తే కొనుగోలు కేంద్రాలతో పాటు, మి ల్లులలో ఇబ్బంది కలగకుండా ధా న్యాన్ని కొనుగోలు చేయవచ్చని చె ప్పారు. ఇందుకుగాను వ్యవసాయ శాఖ వరి పంట కోతల ఆధారంగా ఒక షెడ్యూల్ ను రూ పొందించాల ని ఆదేశించారు.

ఒకే సారి వరి కోతలు జరగకుండా ఇది వరకే డివిజన్ల వారిగా హార్వె స్టర్లతో సమావేశాలు నిర్వహించడం జరిగిందని, మిర్యాలగూడ ప్రాం తం లో సన్నధాన్యం ఎక్కువగా వచ్చే అ వకాశం ఉన్నందున ఒక్కోసారి మి ల్లుల వద్ద ట్రాక్టర్లు నిలిచిపోయి ట్రా ఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంద ని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొ ని ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు ఎలాంటి సమస్యలు సృష్టిం చవద్దని కోరారు.

ప్రత్యేకించి సన్న ధాన్యం కొనుగోలు విషయంలో తేమ, ఇతర అంశాల లో రైతులకు ఇబ్బందులు కలగకుం డా చూడాలన్నారు. ప్రతి మిల్లులో ధాన్యం వాహనాలు వచ్చేందుకు, వె ళ్లేందుకు ప్రత్యేకదారులు ఏర్పాటు చేయాలని కోరారు.పత్తి కొనుగోలు కు సంబంధించి రైతులు స్లాట్ బుక్ చేసుకుని ఏదైనా కారణం చేత పత్తి ని అమ్మన్నట్లయితే స్లాట్ ను రద్దు చేసుకోవచ్చని, రైతుకుండే మూడు స్లాట్లు అలాగే ఉంటాయని, ఈ వి షయంపై రైతులకు పెద్ద ఎత్తున అ వగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

8 నుండి 12 శాతం తేమఉంటే వెం టనే పత్తి కొనుగోలు కేంద్రానికి వెళ్లే విధంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించా లని, తేమను పరిశీలించుకునేం దు కు ప్రతి క్లస్టర్ కు ఒక మిషన్ ఇవ్వ డం జరిగిందని, రైతులు వారికి సం బంధించిన క్లస్టర్ లో పత్తి తేమ శా తాన్ని పరిశీలించిన తర్వాత ఎంత తేమ ఉందో తెలుసుకొని కొనుగోలు కేంద్రాలకి వెళ్లాలని ఆమె సూచించా రు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మా ట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రై తులకు, జిల్లా యంత్రాంగానికి, మి ల్లర్లకు ఇబ్బందులు కలగకుండా ప్ర తి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం పోలీస్ శాఖ తరపున అవ స రమైన సహకారం అందిస్తామని, అ యితే ఒకేసారి ధాన్యం రాకుండా వి డతలవారీగా వచ్చేలా చర్యలు తీ సుకోవాలని, ఇందుకు అవసరం అ యితే టోకెన్లు జారీ చేయడం లేదా ముందే ధాన్యం వచ్చే వివరాలను షెడ్యూల్ రూపొందించి తమకు ఇవ్వాలని, దాని ప్రకారం తాము సహకారం అందిస్తామని తెలిపారు.

ధాన్యం సేకరణ ముగిసే వరకు దా న్యం సేకరణలో భాగస్వామ్యం ఉ న్న అన్ని శాఖల అధికారులు వారి వారి కార్య స్థానాలలో అందుబాటు లో ఉండేలా చూడాలని జిల్లా కలెక్ట ర్ తో విజ్ఞప్తి చేశారు. అలాగే అంత ర్ రాష్ట్ర చెక్ పోస్ట్ లలో విధులకు ఆదేశించిన సిబ్బంది అందరూ ఉం డాలని కోరారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీని వాస్ మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజ న్లో జిల్లాలో ఆరు లక్షల 13 వేల మె ట్రిక్ టన్నుల దాన్యం ప్రభుత్వం ద్వా రా ఏర్పాటు చేసిన కొనుగోలు కేం ద్రాలకు వచ్చే అవకాశం ఉందని, ఇ ప్పటివరకు లక్ష అరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని, మిర్యా లగూడ ప్రాంతంలో మిల్లులకు సన్న ధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తేమశాతం ఎ క్కువగా ఉందన్న సాకుతో మిల్లర్లు రైతులకు నష్టం కలగకుండా చూడా లని, ఎలాంటి ఇబ్బందులు సృష్టిం చవద్దని కోరారు.

రైస్ మిల్లర్ల అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, భద్రాద్రి మాట్లాడుతూ మి ర్యాలగూడ ప్రాంతంలో ప్రతిరోజు 4 000 నుండి 5000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న ధాన్యాన్ని దిగుమ తి చేసుకునేందుకు అవకాశం ఉం దని, నవంబర్ 10నుండి 15 మధ్య ఎక్కువగా ధాన్యం వచ్చే అవకాశం ఉందని ,రైతులు నాణ్యత ప్రమాణా లతోనే ధాన్యాన్ని తేస్తే బాగుంటుం దని సూచించారు.

దేవరకొండ ఏసిపి మౌనిక, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి ,ఆర్డీవోలు రమణారెడ్డి, శ్రీ దేవి, డిఎస్పి శివరాం రెడ్డి, రాజశేఖ ర్ శర్మ, డిసిఓ పత్యానాయక్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశం, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపి కృష్ణ,జిల్లా వ్యవసాయ అధికారి శ్ర వణ్, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.