Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అప్పీల్, ప్రతి ఒక్కరూ మానసిక ఆ రోగ్యం పై దృష్టి సారించాలి 

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: సమాజం లో ప్రతి ఒక్కరూ మానసిక ఆరో గ్యంపై దృష్టి సారించాల్సిన అవస రం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి అన్నారు.ఈ నెల 4 నుండి 12 వరకు మానసిక ఆరోగ్యం శ్రేయస్సు పై లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ వారు నిర్వహిస్తున్న వారోత్సవాలలో భా గంగా శనివారం నల్గొండ జిల్లా కేం ద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీ ని ఆమె ప్రారంభించారు. ఈ సంద ర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కలె క్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం సమా జంలో ప్రతి ఒక్కరు ఎదో రకంగా మానసికంగా బాధపడుతున్నార ని, మరికొందరు మానసిక వత్తిడికి లోనవుతున్నారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏది ఏమైనప్పటికీ మనం ఈ సమ స్యను పక్కన పెడుతున్నామని, మానసిక వత్తిడి తగ్గాలంటే జీవన విధానం మార్చుకోవాలని ,స్మార్ట్ ఫో న్ ను సాధ్యమైనంతగా తగ్గించాల ని, ప్రత్యేకించి పాఠశాల, కళాశాల విద్యార్థులు స్మార్ట్ ఫోన్ ను పక్కన పెట్టాలన్నారు. పెద్దలు సైతం రాత్రి సమయాలలో వత్తిడి లేకుండా ఉ న్నప్పుడే మంచి నిద్రతో పాటు, మా నసికంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.

మానసిక ఆరోగ్యం పై లయన్స్ క్లబ్ జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నా రు. మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన సరిపోదని, మా నసిక ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా ముఖ్యమని, దీనికై ఉదయ పు నడక, ప్రశాంతత, ఒత్తిడికి లో ను కాకుండా ఉండడమే ముఖ్యమ న్నారు. ఇటీవల కాలంలో చిన్న వయసు వారు సైతం గుండెజబ్బు లతో చనిపోతున్న విషయాన్ని మ నం గమనిస్తున్నామని, మనిషి అనే క రకాల ఒత్తిళ్లకు గురి కావడం జ రుగుతున్నదని, ఈ వత్తిడికి అన్ని అంశాలు ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు.

ప్రతి ఒక్కరూ మానసికంగా దృఢం గా ఉండేలా చూసుకోవాలని , మె దడుకు ఆ విధంగా శిక్షణ ఇవ్వాల ని,ఇందుకు గాను తప్పనిసరిగా ఒ త్తిడి కల్పించని అంశాలను చద వాలని చెప్పారు. పోటీ పరీక్షలు ఇ తర అంశాలలో పేద పిల్లలకు సహా యం చేసేందుకు నల్గొండలో ఒక టౌ న్ హాల్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఈ విషయం లో లయన్స్ క్లబ్ సహకరించాలని కోరారు.

లయన్స్ క్లబ్ లాగా అంద రూ ముం దుకు వచ్చి సామాజిక సే వా పద్ధతి ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. ఈ కార్య క్రమంలో లయన్స్ క్లబ్ డిస్టిక్ గవ ర్నర్ మదన్ మోహ న్, నల్గొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.