Nalgonda District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అప్పీల్, పోషణ మాసo ఉత్సవాల ను వినూత్నంగా నిర్వహించాలి
Nalgonda District Collector Ila Tripathi :
ప్రజా దీవెన, నల్లగొండ: పోషణ మా సo ఉత్సవాలను వినూత్నంగా ని ర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి ఆదేశించారు. “పోషణ మా సం” పై శుక్రవారం ఆమె జిల్లా కలె క్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ, సంబంధిత శాఖ అధికారులతో స మావేశం నిర్వహించారు.కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 17 నుండి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం నిర్వహిస్తున్న విష యం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతిరోజు వివిధ స్థాయిలలో పలు కార్యక్రమాలను నిర్వహించడం జ రుగుతున్నది.
ఈ కార్యక్రమాలలో భాగంగా పాలి చ్చే తల్లులకు కౌన్సిలింగ్ నిర్వహిం చడం, పిల్లలలో లా వు(ఒబేసిటీ) ఎక్కువబరువును తగ్గించే ఆహారం పై అవగాహన కల్పిం చడం, పిల్లల కు పోషణ ఆహారంలో మగవారిని భాగస్వామ్యం చేయడం, స్థానిక వంటకాలను ప్రోత్సహించడం, పి ల్ల లు ఆడుకునేందుకు స్థానికంగా దొ రికే చెక్క బొమ్మ లు, కర్ర బొమ్మలు, మట్టితో తయా రు చేసిన బొమ్మల వాడకం, విని యోగం, పౌష్టికాహార మిషన్ కింద వందరోజుల ప్రణాళిక ను రూపొందించడం, యోగ చేయ డం, రక్తహీనత తగ్గించడం, గ్రామ , వార్డు సభల నిర్వహణ, కిచెన్ గా ర్డెన్ల పెంపకం, కూరగాయల పెంప కం, పోషణ వాటికల నిర్మాణం, చే తులు శుభ్రంగా కడుక్కోవడం, హై జీన్, తాగునీరు, పరిశుభ్రత వంటి కార్యక్రమాలపై వివిధ కార్యక్రమాల ను చే పడుతున్నారు.
ఇందులో భాగంగా గ్రామ స్థాయి మొదలుకొని జిల్లా స్థాయి వ రకు పలు కార్యక్రమాలను చేపట్టను న్నారు. ఈ కార్యక్రమాలలో మహి ళా శిశు సంక్షేమశాఖతో పాటు, వై ద్య ఆరోగ్యశాఖ, డిఆర్డిఏ, వ్యవ సాయ, రెవెన్యూ, హార్టికల్చర్, ఆర్డ బ్ల్యూఎస్, స్వయం సహాయక మ హిళా సంఘాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, పంచాయతీ, మున్సి పాలిటీలు భాగస్వామ్యం కాను న్నాయి. గత సంవత్సరం జిల్లాలోని దేవరకొండ తో పాటు, వివిధ ప్రాం తాలలో పోషణ మాసాన్ని వినూ త్నంగా నిర్వహించిన విషయం తెలి సిందే.ఈ సంవత్సరం సైతం పోష ణ మాసం కింద వినూత్న కార్యక్ర మాలు చేపట్టి అందరికీ ఉపయోగ పడేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ప్రత్యేకించి సిడిపివో లు అంగన్వా డీలలో కిచెన్ గార్డెన్ ల పెంపకంపై దృష్టి సారించాలని, సొంత భవనా లు ఉన్న 625 అంగన్వాడీ కేంద్రాల లో కనీసం 425 కేంద్రాల లో కిచెన్ గార్డెన్ పెంచాలని, ఇందుకు అవ స రమైన మొక్కలను స్థానిక ఏపీఎంల ద్వారా తీసుకోవాలని, అ వసరమై తే విత్తనాలను సైతం ఇవ్వడం జరు గుతుందని తెలిపారు. ప్రహరీలు లేని అంగన్వాడీలకు బ యో కంచె ఏర్పాటు చేయాలన్నారు. పోషణ వాటికలను పెంచాలని, ఐసిడిఎస్ అధికారులు, అంగన్వాడీ కేంద్రాల కు భవనాలకై స్థలాలను గుర్తించా లని చెప్పారు.
స్థానిక శాసనసభ్యుల సహకారంతో సిడిపి వోలు ఒక రోజు పోషణ మా సోత్సవాలను ఘనంగా నిర్వహిం చాలని అన్నారు. ఈ కార్యక్రమా లలో అందరినీ భాగస్వామ్యం చే యాలని సూచించారు. గ్రామస్థాయి లో నిర్వహించే గ్రామైక్య సంఘాల సమావేశాలలో ఇతర శాఖలతో పా టు, ఐసిడిఎస్, అంగన్వాడి కార్య కర్తలు తప్పనిసరిగా హాజరుకావాల ని , అన్ని అంగన్వాడీ కేంద్రాలలో టాయిలెట్లు ఉండేలా చూడాలని, ఈ సమా వేశాలలో ఆర్ బి ఎస్ కె ల గురించి మాట్లాడలన్నారు.
జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ పోషణ మా సం సందర్భంగా పిల్లలకు నిర్వహిం చే పరీక్షలు, తదితర అంశాలపై వి వరించారు.జిల్లా వ్యవసాయ అధి కారి శ్రవణ్ కిచెన్ గార్డెన్లలో పెంచే కూరగాయలు, మొక్కలపై అవగా హన కల్పించారు. నల్గొండ ఆర్డిఓ వై .అశోక్ రెడ్డి మాట్లాడుతూ అంగ న్వాడి కేంద్రాలకు పక్కా భవనాల ని ర్మాణానికి అవసరమైన స్థల సేకర ణకు తమశాఖ తరపున సహకరి స్తామని తెలిపారు..
మహిళా శిశు సంక్షేమ శాఖకు అవ సరమైన కిచెన్ గార్డెన్ ల పెంపకం తదితర అంశాల పై డిఆర్డిఏ ద్వారా సహకార అంది స్తామని డిఆర్డిఓ శే ఖర్ రెడ్డి తెలుపగా, మహిళా సిస్ సంక్షేమ శాఖ జిల్లా అధికారి కృష్ణవే ణి పోషణ మాసం ప్రాధాన్యతను రోజువారి నిర్వహించే కార్యక్రమాల షెడ్యూల్ ను సమావేశానికి తెలియ జేశారు. ఈ సందర్భంగా ప వర్ పా యింట్ ప్రజెంటేషన్ ద్వారా వివ రాలను ఆమె సమావేశానికి వెల్ల డించారు. ఈ సందర్బంగా పోషణ మాసం పై రొపొందించిన గోడ పత్రి కను ఆవి ష్కరించారు.డిప్యూ టీ డి ఎం హెచ్ ఓ వేణుగోపాల్ రెడ్డి, సిడి పివోలు, తదితరులు ఈ స మావేశా నికి హాజరయ్యారు.