Praja Deveena
Newspaper Banner
Date of Publish : 23 August 2025, 2:29 pm Posted by : praja deveena

Nalgonda District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం,వారం రోజుల్లో ఆ దరఖా స్తులను గుర్తించి సమర్పించాలి

Nalgonda District Collector Ila Tripathi :

ప్రజా దీవెన, నల్లగొండ: జాతీయ కు టుంబ ప్రయోజన పథకం కింద అ ర్హత ఉన్న దరఖాస్తులను గుర్తించి వారం రోజుల్లో సమర్పించాలని జి ల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి ఆదేశించా రు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై శనివారం ఆమె టెలికాన్ఫ రెన్స్ నిర్వహించారు.

ఈ పథకం కింద దారిద్య్ర రేఖ దిగు వనున్న ప్రాథమిక ఆదాయం కలిగి న 18 నుండి 59 సంవత్సరాల మ ధ్య వయసున్న కుటుంబ పెద్ద పురు ష లేదా మహిళ సహజ లేదా ప్రమా దవశాత్తు మరణించిన సమయం లో ఒకేసారి 20వేల రూపాయల న గదు సహాయాన్ని కుటుంబానికి అం దించడం జరుగుతుందని తెలిపా రు. కుటుంబంలో ప్రాథమిక సంపా దన దారుడు మరణించిన రెండు సంవత్సరాలు లోపు ఈ సహాయా నికి వారి కుటుంబ సభ్యులు దర ఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అంత్యోదయ అన్నా భీమా యోజ న, జన శ్రీ బీమా యోజన కింద ల బ్ధి పొందిన వారు ఈ పథకానికి అ ర్హులు కాదని స్పష్టం చేశారు.

ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తులను సంబంధిత తహసి ల్దార్ కార్యాలయంలో సమర్పించా లని, దరఖాస్తుతో పాటు మరణించి న వ్యక్తికి సంబంధించిన మరణ ధ్రు వీకరణ పత్రం, వ్యక్తిగత గుర్తింపు ప త్రం, చిరునామా రుజువు, దారిద్ర్య రేఖకు దిగువనున్నట్లు తెలిపే రేషన్ కార్డు లేదా ధ్రువ పత్రం జత చేయా లని, అదేవిధంగా సహాయం పొం దేందుకు దరఖాస్తు చేసిన కుటుంబ సభ్యునికి సంబంధించిన వ్యక్తిగత గుర్తింపు పత్రం, చిరునామా రుజు వు,వయస్సు, కుటుంబ సభ్యుని ధ్రువపత్రం ,ఆధార్ లింక్ చేసిన బ్యాంకు ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా వివరాలతో పాటు, ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను జత చేసి సమ ర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

నల్గొండ జిల్లాకు జాతీయ కుటుంబ ప్రాయోజన పథకం కింద 3500 మందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రభు త్వం కేటాయించడం జరిగిందని జి ల్లా కలెక్టర్ తెలిపారు. అందువల్ల జిల్లాలోని అందరూ గ్రామపంచా యతీ కార్యదర్శులు జనవరి ఒకటి, 2024 నుండి మరణించిన వారి వి వరాలను మరణ రిజిస్టర్ ఆధారం గా తక్షణమే ఎంపీడీవోలకు పంపిం చాలని ఆదేశించారు. ఎంపీడీవోలు పరిశీలనానంతరం జాబితాలను త హసిల్దార్లకు సమర్పించాలని ఆదే శించారు.

మున్సిపల్ స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు జాబితాను పంపించా లని చెప్పారు. ఈ పథకం కింద జి ల్లాలో అర్హత ఉన్న వారందరూ లబ్ధి పొందే విధంగా ఆర్డీవోలు, తాసిల్దా రులు, ఎంపీడీవోలు, ఏపీఎంలు కృ షి చేయాలని ప్రత్యేకించి మండల ప్రత్యేక అధికారులు సైతం ఈ విష యంపై సమన్వయ సమావేశం ఏ ర్పాటు చేసుకొని పర్యవేక్షించాల న్నారు. ఆర్ డిఓ సబ్ కలెక్టర్ లు వెంటనే వారి పరిధిలోని ఏపీఎం లు ,తహసిల్దారులు, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించాలని చెప్పా రు. వచ్చే శనివారం లోపు దరఖా స్తులన్నింటిని తహసిల్దారులు పూ ర్తి విచారణ నిర్వహించి ఆర్డీవోకు సమర్పించాలని ,ఆర్డీవోలు ఆన్లైన్ ద్వారా జిల్లా రెవిన్యూ అధికారికి పంపించాలని, జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి అర్హత ఉన్న దరఖాస్తు లను పంపించడం జరుగుతుందని కలెక్టర్ చేశారు.

ఆర్డీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ పథకం కింద దరఖాస్తులను పంపిం చాలని సూచించారు. మిర్యాలగూ డ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీని వాస్ ,డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య తదితరులు మాట్లాడారు.