Nalgonda District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లాకలెక్టర్ ఇలా త్రిపాఠి అల్టిమేటం, స్థానిక ఎన్నికలను ఆ షామాషీగా తీసుకోవద్దు
Nalgonda District Collector Ila Tripathi :
ప్రజా దీవెన, నల్లగొండ: గ్రామ పం చాయతీ ,ఎంపీటీసీ, జడ్పిటిసి ఎ న్నికలను ఆషామాషీగా తీసుకోవ ద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అ న్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నో డల్ అధికారులతో ఆమె సమావేశ మయ్యారు. ఎన్నికల నిర్వహణ వి ధులకు నియమించబడిన ఉద్యో గుల పూర్తి డేటాను తక్షణమే సమ ర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికా రి, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి డిఈఓ బిక్షపతిని ఆదేశిం చారు. ఎన్నికల, నియమ, నిబంధ నల ప్రకారం అన్ని శాఖల అధికారు లకు,సిబ్బందికి విధులు నిర్వహిం చేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు.
స్థానిక సంస్థల ఎన్నికలను సవ్యం గా నిర్వహించడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఎ క్కడ ఎలాంటి పొరపాట్లకు తావివ్వ వద్దని ఆమె ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు శా ఖల ద్వారా నిర్వహించే ఇతర పను లను సైతం ఎలాంటి జాప్యం లేకుం డా నిర్వహించాలని అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా నో డల్ అధికారుల వారిగా వారు చే యవలసిన విధులపై సన్నద్ధతను, కార్యచరణ ప్రణాళికను అడిగి తె లుసుకున్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీని వాస్ గ్రామ పంచాయతీ ఎన్నికల ను సక్రమంగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు వారి విధులకు సంబంధించి చెక్ లిస్ట్ ను రూపొం దించుకోవాలని ,ఎన్నికల నియమ, నిబంధనల ప్రకారమే విధులు నిర్వ ర్తించాలని, ముఖ్యంగా ఎన్నికల వి ధులు నిర్వహించే సిబ్బందికి సం బంధించి అన్ని కేటగిరీలలో పూర్తి వివరాలతో డేటాను వెంటనే సమ ర్పించాలని, 20 శాతం ఉద్యోగులు రిజర్వులో ఉండేలా చూడాలని, పో లింగ్ పర్సనల్ కు సంబంధించిన అంశాలన్నీ ముందే చూసుకోవాలని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల విధులకు నియమించబడిన పిఓ,ఏపిఓలు అందరికీ శిక్షణ ఇవ్వాలని, ఎన్నికల సామాగ్రీని సామాగ్రి నోడల్ అధికారి ముందే తనిఖీ చేసుకోవాలని, నా మినేషన్లకు సంబంధించిన ఏర్పా ట్లు పోలింగ్ కేంద్రాలలో కనీస మౌ లిక వసతుల కల్పన, కౌంటింగ్ ఏ ర్పాట్లు, కౌంటింగ్ సిబ్బంది నియా మకం వంటి వాటిపై సంబంధిత నో డల్ అధికారులు దృ ష్టి సారించాల న్నారు. స్థానిక సంస్థల ఇన్చార్జ్ అద నపు కలెక్టర్ నారాయణ అమిత్, జెడ్ పి సి ఈ ఓ శ్రీనివాసరావు, జి ల్లా పంచాయతీ అధికారి వెంక య్య, నోడల్ అధికారులు ఈ సమా వేశానికి హాజరయ్యారు.