Praja Deveena
Newspaper Banner
Date of Publish : 25 October 2025, 4:10 pm Posted by : praja deveena

Rice Millers : నల్లగొండ జిల్లా కలెక్టర్ కీలక ఆదే శం, రైస్ మిల్లర్లు తక్షణమే బ్యాంక్ గ్యారంటీలు సమర్పించాలి 

Rice Millers : ప్రజా దీవెన, మిర్యాలగూడ: నల్ల గొండ జిల్లాలో ధాన్యం సేకరణలో భాగంగా ఈ వానాకాలానికి సం బంధించి జిల్లాలోని రైస్ మిల్లర్లు త క్షణమే బ్యాంక్ గ్యారంటీలను సమ ర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి కోరారు.శనివారం ఆమె నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో స మావేశం నిర్వహించారు.

ఇంకా బ్యాంకు గ్యారంటీలు సమ ర్పించని మిల్లర్లు తక్షణమే బ్యాంకు గారెంటీలు సమర్పించాలని కోరా రు. ధాన్యం సేకరణలో భాగంగా ఈ వానకాలం ధాన్యాన్ని మిల్లర్లు ఎప్పటికప్పుడు వారి మిల్లులలో దించుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని చెప్పా రు. అకాల వర్షాల కారణంగా కొను గోలు కేంద్రాలు, పంట మీద దాన్యం తడిసిపోయేందుకు అవకాశం ఉ న్నందున నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధా న్యాన్ని దించుకోవడంలో జాప్యం చేయకుండా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకొని రైతులకు సహకరించాలని ఆమె వి జ్ఞప్తి చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ అవం తి పురంలోని సూర్య తేజ రైస్ ఇండ స్ట్రీస్ ను సందర్శించి అక్కడ ధా న్యం ప్రాసెసింగ్ ప్రక్రియను పరిశీలిం చారు. అంతేకాక బాయిల్డ్ రైసు, డ్రైయర్స్ తదితర అంశాలను మిల్ ఓనర్ ద్వారా అడిగి తెలుసుకున్నా రు.

మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నా రా యణ అమిత్ ,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా పౌర సర ఫరాల అధికారి వెంకటేష్, పౌరసర ఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, మి ర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, జనరల్ సెక్రెట రీ బాబి, అధికారులు, మిల్లర్లు ఉ న్నారు.