Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ పిలుపు, నూ లిపురుగుల నివారణకు విధిగా అ ల్బెండ జొల్ మాత్రలు వేయించాలి

– నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రతి ఒక్కరూ ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా అల్బెండ జొల్ మాత్రలు వేయించా లని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలు పునిచ్చారు. పిల్లల్లో మానసిక, శారీ రక పెరుగుదలకు తప్పనిసరిగా ఆ ల్బెండజోళ్ మాత్రలు వేయించాలని అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని సోమవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాలలో విద్యార్థులకు నులిపురుగు ల నివారణకు ఆల్బెండజోళ్ మందు లు తినిపించారు.

 

కడుపులో నులిపురుగులు ఉండ టం వల్ల పిల్లల్లో ఎదుగుదల ఆగిపో తుందని ,ఇది రక్తహీనతతో పాటు, కడుపునొప్పి, ఇతర రకాల నొప్పుల కు, మానసిక వైకల్యానికి దారి తీసే ప్రమాదం ఉందని, ఎత్తు, బరువు మూర్తిమత్వం ఎదుగుదల ఉండద ని, అందువల్ల ఒకటి నుండి 19 సం వత్సరాల వయసున్న పిల్లలందరూ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్ర లు వేసుకోవాలని చెప్పారు. ఆల్బెం డజోల్ మాత్రలు వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, భోజనం తర్వాత ఈ మాత్రలు వేసుకోవాల ని, జిల్లాలో 19 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరికీ నూటికి నూరు శాతం ఆల్బెండజోళ్ మాత్ర లు వేయించాలని వైద్య ఆరోగ్యశా ఖ అధికారులను ఆమె ఆదేశించా రు.

ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీల ఆధ్వ ర్యంలో డాక్టర్ల పర్యవేక్షణలో ఈ మాత్రలు వేయటం జరుగుతుంద ని, అందువలన ఎవరు భయపడా ల్సిన అవసరం లేదని, మాత్రలు వే సుకున్న తర్వాత 30 నిమిషాలు పరిశీలనలో ఉంచడం జరుగుతుం దని ,ఎవరికైనా ఇబ్బందులు ఏర్పడి నట్లయితే తక్షణమే వైద్యుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు పిల్ల లు ఉన్న తల్లిదండ్రులు తప్పనిసరి గా పిల్లలకు నులిపురుగుల నివా రణ మందులు ఆల్బెండజోళ్ వే యించాలన్నారు. గతంలో ప్రభు త్వం సంవత్సరానికి రెండుసార్లు ఈ మాత్రలను వేసేదని, ఇప్పుడు సం వత్సరంలో ఒకసారి మాత్రమే వేస్తు న్నందున ఎట్టి పరిస్థితులలో ఈ మాత్రలు వేసుకోవడం తప్పిపోకుం డా చూడాలని, ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి పిల్లలతో పాటు, తల్లి దం డ్రులు సహకరించాలని కోరారు.

అనంతరం జిల్లా కలెక్టర్ స్వయంగా విద్యార్థులకు ఆల్బెండజొల్ మాత్ర లు తినిపించారు.

 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు తప్పనిసరిగా ఆల్బెండ జోళ్ మాత్రలు తీసుకోవాలని, దీని వల్ల రక్తహీనత వంటివి రాకుండా ఉంటాయని , నులిపురుగులు మా నసికంగా ఎదగనీయకుండా చేస్తా యని అందువల్ల ఈ మాత్రలు త ప్పనిసరిగా తీసుకోవాలని కోరారు.

కాగా జాతీయ నులిపురుగుల నివా రణ దినోత్సవం సందర్బంగా నల్గొం డ జిల్లాలో మూడు లక్షల 86,134 మంది 1-19 సంవత్సరాల లోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించాలన్నది లక్ష్యం. ఇందులో 2093 అంగన్వాడి కేంద్రాలలోని పి ల్లలకు ,1552 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు, 404 ప్రై వేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు ,13 జూనియర్ కళాశాలలు, 61 ప్రైవేటు జూనియర్ కళాశాలలు, ఐ దు టెక్నికల్ కళాశాలలో, 11 ఒకేష నల్ కళాశాల విద్యార్థులకు ఈ మా త్రలు ఇచ్చేందుకు జిల్లా యంత్రాం గం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వ ర్యంలో చర్యలు తీసుకున్నది. ఇం దుకుగాను జిల్లాకు 4 లక్షల 158 00 ఆల్బెండజోళ్ మాత్రలు వచ్చా యి. నులిపురుగుల మాత్రల పంపి ణీ సవ్యంగా నిర్వహించేందుకుగా ను వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అన్ని అంగన్వాడి కేంద్రాలు, పాఠశా లలు, కళాశాలలకు ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా వే యించేందుకు చర్యలు తీసుకోవ డం జరిగింది. ఇందుకుగాను ఎమర్జె న్సీ రెస్పాన్స్ టీమ్ సైతం ఏర్పాటు చేయడమే కాకుండా, విద్యాశాఖ, మహిళ శిశు సంక్షేమ ,ఇతర శాఖల సహకారంతో కార్యక్రమాన్ని విజయ వంతం చేసేందుకు కార్యచరణ ప్ర ణాళిక రూపొందించడం జరిగింది. ఏదైనా కారణం చేత 11 న ఆల్ బెండ జొల్ మాత్రలు వేయించుకొ నని పిల్లలు ఈ నెల 18 న నిర్వ హించే మాప్ అప్ కార్యక్రమంలో మాత్రలు వేయించుకోవచ్చు. ఈ కా ర్యక్రమం లో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ వేణుగోపాల్, రేణుక, జి ల్లా విద్యాశా ఖ అధికారి బిక్షపతి, జిల్లా మాస్ మీడియా అధికారి తి రుపతి రావ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.