District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ అప్పీల్, వ్య క్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతతో నే అంటువ్యాధులు అరికట్టవచ్చు
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ:వ్యక్తిగత ప రిశుభ్రతకు ప్రాధాన్యతా ఇచ్చిన ప్పుడే వ్యాధులను అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
మంగళవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని ఏ ఆర్ నగర్ లో పర్య టించారు .గత సంవత్సరం ఇక్కడి నుండి ఎక్కువ డెంగ్యూ కేసులు న మోధైన విషయాన్ని దృష్టిలో ఉంచు కొని ఈ సంవత్సరం పరిస్థితులను పరిశీలించేందుకు ఆమె ఏ ఆర్ నగ ర్ లో పర్యటించారు.
అయితే ఈ సంవత్సరం ఏ ఆర్ న గర్ నుండి ఇలాంటి డెంగ్యూ కేసు లు నమోదు కాలేదుని వార్డు లో పరిసరాలతో పాటు, మురికి కా లువలు, ఇండ్లను జిల్లా కలెక్టర్ తిరి గి పరిశీలించారు.ప్రజలు పాటిస్తు న్న వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను గమనించారు.
వార్డు లో ఓపెన్ డ్రైనేజ్ సిస్టం ఉం డడం, పరిశుభ్రత లోపించడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తక్షణమే ఓపెన్ డ్రైనేజీ సిస్టం మూసివేయాల ని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాల ని, వాటికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే వ్యాధులను అరికట్టవచ్చని అన్నా రు.
మనుషులు, పరిసరాలు పరిశుభ్రం గా ఉన్నప్పుడు ఎలాంటి వ్యాధులు రావని చెప్పారు. వార్డులో నిర్వహి స్తున్న జ్వర సర్వే సందర్బంగా మలే రియా సిబ్బందితో మాట్లాడారు. ఇ ప్పటివరకు నమోదైన జ్వర కేసు లు,మలేరియా,టైఫాయిడ్,డెంగ్యూ తదితర వివరాలను అడిగి తెలుసు కున్నారు. డాక్టర్లు వచ్చారా? రక్తం నమూనాలు తీసుకున్నారా? అని ఇంటి యజమానుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు, అం టువ్యాధుల వంటివి రాకుండా తా గునీటిని కాచి చల్లార్చి వడపోసి తా గాలని, తాజా ఆహారాన్ని తినాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కోవడంతో పాటు, వ్యక్తిగత పరిశు భ్రతను పాటించాలని ఆమె వార్డు ప్రజలకు సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ లైన్ వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ అందుబా టులో ఉన్న మందులు, నమోదైన హై రిస్క్ కేసులు, ప్రసవ కేసుల నమోదు, ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణీ స్త్రీల ఈ డి డి కేసులు, క్యా లెండర్ ప్రకారం చికిత్స అందిస్తున్న ది లేనిది పరిశీలించి సంతృప్తి వ్య క్తం చేశారు. లైన్ వాడ వార్డులో జ నాభా ఎక్కువగా ఉన్నందున ఇక్క డ మరో పట్టణ ప్రాథమిక వైద్య ఆ రోగ్య కేంద్రం అవసరం ఉంటుందని, అందువల్ల ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించేందుకు సిద్ధం చేయాలని జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ,డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్, ఆర్డిఓ వై.అశోక్ రెడ్డి ,మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అ హ్మద్ ,లైన్ వాడ పట్టణ ప్రాథమి క ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఇంతియా జ్, మలేరియా సిబ్బంది, తదితరులు ఉన్నారు.