Nalgonda District Collector Ila Tripathi :
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: చదువుతోనే అన్ని సాధ్యమవుతా యని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అ న్నారు.ఈనెల 14 నుండి 20 వ ర కు నిర్వహిస్తున్న 58వ “జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో” భా గంగా బుధవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాల యంలో నిర్వహించిన కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు.
ముందుగా జిల్లా కలెక్టర్ స్వర్గీయ భారత ప్రధాని ఇందిరాగాంధీ జ యంతిని పురస్కరించుకొని ఏర్పా టుచేసిన ఇందిరా గాంధీ చిత్రపటా నికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం విద్యార్థిను లనుద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ ఎంతో కష్టపడి ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారని, పేద ప్రజల సం క్షేమానికి “గరీబి హఠావో” నినాదా న్ని తీసుకువచ్చారని, ఆమెకు అనే క భాషలలో ప్రావీన్యురాలని, తండ్రి జవహర్లాల్ నెహ్రూ ప్రధాని అయిన ప్పటికీ ఆమె స్వయంగా కష్టపడి ప్ర ధానమంత్రి అయ్యారని, ఇందిరా గాంధీ లాగా కష్టపడి చదివి సమా జంలో మంచి స్థానానికి రావాలని ఆమె విద్యార్థినిలకు పిలుపునిచ్చా రు.
చదువు ద్వారానే ఇవన్నీ సాధ్య మ వుతాయని, ఏదైనా సాధించా లనే తపన, కోరిక ప్రతి ఒక్కరూ కలి గి ఉండాలని, చిన్నప్పుడు కష్టపడి తే పెద్దయ్యాక సంతోషంగా ఉంటార ని, గొప్ప ఆలోచనలు, కష్టాలు ఎదు ర్కొ నే మనస్తత్వం కలిగి ఉంటే త ప్పని సరిగా భవిష్యత్తులో ఉన్నత స్థానం లో ఉంటారని అన్నారు. మ నసుకు ఎంతో శక్తి ఉంటుందని, మ నసులో ఏమనుకుంటే అది సాధ్య మవుతుందని తెలిపారు. జిల్లా గ్రం ధాలయ సంస్థ ప్రస్తుత భవనం సరి పోనందున గతంలో ఉన్న టౌన్ హా ల్ స్థానంలో బాలికలకు,బాలురకు వే రు వేరుగా ప్రత్యేకంగా ఫ్లోర్లు ని ర్మించి అక్కడ గ్రంథాలయాన్ని ఏ ర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామ ని, ఇందుకు సంబంధించిన పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయడం జరి గిందని క లెక్టర్ వెల్లడించారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఎం. ఆఫీస్ ఖాన్ మాట్లాడు తూ గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అం దిస్తాయని, నల్గొండ జిల్లా కేంద్ర గ్రం థాలయ ప్రస్తుత భవనం సరిపోనం దున కొత్త బిల్డింగ్ మంజూరు చే యాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.జిల్లా గ్రంధాలయ సంస్థ సెక్ర టరీ బాలమ్మ, బాలుర, బాలికల ప్ర భుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సి పల్స్ సిబ్బంది, తదితరులు ఈ కా ర్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ పోటీల లో గెలుపొందిన విద్యార్తినిలకు బహుమతులు అందజేశారు.
