Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశం,వీధి కుక్కలపై విస్తృతప్రచారం కల్పిం చండి

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ:మున్సిపల్ పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతా లలో వీధి కుక్కల ఫై పెద్ద ఎత్తున ప్ర చారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశా రు. ఈ విషయమై సోమవారం ఆ మె సంబంధిత అధికారులు, మండ ల ప్రత్యేక అధికారులు, ఆర్ డి ఓల తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

పాఠశాల విద్యార్థులకు వీధి కుక్కల పై కరపత్రాల ద్వారా అవగాహన క ల్పించాలని, దీనిద్వారా వారి తల్లి దండ్రులకు సమాచారం వెళుతుం దని, అలాగే విద్యార్థులతో పెద్ద ఎ త్తున ర్యాలీలు నిర్వహించాలని చె ప్పారు. దీంతోపాటు, గ్రామీణ ప్రాం తాలలో హోర్డింగ్ లు ఏర్పాటు చేసి ప్రజలకు వీధి కుక్కల వల్ల కలిగే న ష్టాలు, వీధి కుక్కల స్టెరిలైజేషన్, వా క్సినేషన్, దత్తత తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.

గతవారం దేవరకొండ డివిజన్లో వీ ధి కుక్కల వ్యాక్సినేషన్ దత్తత కా ర్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వ హించడం పట్ల ఆమె దేవరకొండ డివిజన్ అధికారులు,జిల్లా పశుసం వర్ధక శాఖ అధికారిని అభినందిం చారు. ఇదేవిధంగా అన్ని మున్సిప ల్ పట్టణ ప్రాంతాలలో కుక్కల వ్యా క్సినేషన్ తో పాటు, స్టెరిలైజేషన్, కు క్కలను దత్తత తీసుకునే విషయం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఇందుకుగాను కుక్కల ప్రేమికులతో సమావేశాలు నిర్వహించాలని చె ప్పారు.

మిర్యాలగూడ మున్సిపాలిటీలో “ఎ నిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం ” ఏర్పా టుకు తక్షణమే అంచనాలను రూ పొందించి ప్రణాళిక తయారు చేసి పంపించాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ను ఆదే శించారు.పంచాయతీ శాఖ ద్వారా అన్ని గ్రామీణ ప్రాంతాలలో హోర్డిం గులు ఏర్పాటు చేయాలని, ము ఖ్యంగా పట్టణ ప్రాంతాల మున్సిప ల్ అధికారులతో అనుసంధానం చే సుకొని కుక్కలకు వ్యాక్సినేషన్, స్టె రిలైజేషన్,దత్తతలకు చర్యలు తీ సుకోవాలని జిల్లా పంచాయతీ అ ధికారిని ఆదేశించారు.

అన్నీ పాఠశాలల్లో విద్యార్థులకు అ వగాహన కల్పించడంలో జిల్లా వి ద్యాశాఖ అధికారి ప్రత్యేక శ్రద్ధ తీ సుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు సైతం వారి మండలాల లో చెత్త, చెదారం, డంపింగ్ యార్డు లు గుర్తించి ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేయించాలని, అలాగే కుక్క లను గుర్తించి వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ దత్తత పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.

ఇటీవల జగిత్యాల జిల్లాలో మూడు సంవత్సరాల బాలుడు కుక్క కాటు కు గురై మరణించిన సంఘటన లాంటిది నల్గొండ జిల్లాలో జరగడా నికి వీలులేదని, ఆ విధంగా అధికా రులు అన్ని ముందు జాగ్రత్త చర్య లు తీసుకోవాలన్నారు. జాతీయ కు టుంబ ప్రయోజన పథకం కింద దర ఖాస్తుల పరిశీలనలో వెనుకబడిన తహసిల్దారులు దరఖాస్తుల పరిశీల నను వేగవంతం చేసి ఆర్డీవోలకు పంపించాలని, నల్గొండ, చండూరు, మిర్యాలగూడ ,దేవరకొండ ఆర్డీవో లు వారితో ఉన్న దరఖాస్తులన్నిం టిని ఆన్లైన్ ద్వారా డిఆర్ఓ పంపిం చాలని చెప్పారు.

మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారా యణ అమిత్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా విద్యాశా ఖ అధికారి బిక్షపతి, తదితరులు మాట్లాడారు.