District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తని ఖీ, శ్రీకనకదుర్గ ఫర్టిలై జర్స్ సీడ్స్ యజమాని పై కేసు నమోదు
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లాలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎరువు ల దుకాణాలపై ఆకస్మిక తనిఖీ లు ముమ్మరం చేస్తున్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్ర సమీపంలోని నల్లగొండ మండలం దోమలపల్లి గ్రా మం లోని శ్రీకనకదుర్గ ఫర్టిలై జర్స్ సీ డ్స్ దుకాణంపై ఎంఆర్ పి ధరలకం టే అధిక ధరలకు యూరియాను వి క్రయిస్తున్న శ్రీ కనకదుర్గ ఫర్టిలై జర్, సీడ్స్ యజమాని పై అక్కడికక్కడే కేసు నమోదు చేశారు. ప్రభుత్వం ని ర్దేశించిన ధరలకు కాకుండా అధిక ధరలకు యూరి యాను విక్రయించి నా, పక్కదారి పట్టించినా ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్య లు తప్పవని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పి శర త్ చంద్ర పవార్ హెచ్చరించారు.
అధిక ధరలకు యూరియాను విక్ర యిస్తున్న నల్గొండ జిల్లా నల్గొండ మండలం దోమలపల్లి లో గల శ్రీ క నకదుర్గ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అం డ్ సీడ్స్ దుకాణ యజమాని పగి డిమర్రి విగ్నేష్, సహాయకులు మొ గుదాల శివ, శీలం లింగమూర్తిలపై కేసు నమోదు చేసినట్లు జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ లు ఒక ప్రకటనలో తె లిపారు.
నల్గొండ మండల వ్యవసాయ అధి కారి శ్రీనివాస్ రోజువారీ తని ఖీలలో భాగంగా బుధవారం తన సిబ్బంది తో మండల పరిధిలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన సంద ర్భంగా నల్గొండ మం డలం, దోమల పల్లి గ్రామంలో ఉన్న శ్రీ కనకదుర్గ ఫర్టిలైజర్స్, ఫస్టి సైడ్స్ & సీడ్స్ దు కా ణాన్ని తనిఖీ చేయడం జరిగిందని, ఆ సమ యంలో ప్రభుత్వం సబ్సిడీ పై సరఫరా చేస్తున్న యూరియా ధ రల ను, యూరియా స్టాక్ వివరాల ను దుకాణం ఎదుట పట్టికలో ప్రద ర్శించలేదని తెలిసింది.
ఈ విషయం గమనించిన అధికారులు దుకాణంలో ఎ రు వులు అమ్మిన రశీదు బుక్కుల ఆ ధారంగా యూరియా కొను గోలు చేసిన కల్వలపల్లి గ్రామానికి చెందిన వంటేపాక సైదులు, కన్నె బోయిన శంకర్, బీరెల్లిగూడెం కు చెందిన దాసరి బిక్షంలు బస్తా యూరియా 266 రూపాయల ఎంఆర్ పి ధరకు బ దులుగా, 350 రూపా యల కు కొనుగొలు చేసినట్లు గమనించడం జరిగిందని, అంతేకాక ఇదే విషయా న్ని సదరు షాపు నుండి యూరి యాను కొన్న పైన పేర్కొ న్న రైతుల తో పాటు, మరికొంతమంది రైతులు వ్యవసాయ అధికా రి దృష్టికి తీసు కురావడం జరిగిందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వ్యయ ప్రయాసల కోర్చి యూరియాను స రఫరా చేస్తుండటం, అంతేగాక ప్ర తిష్టాత్మకంగా తీసుకొని రైతు లం ద రికీ యూరియాను అందించేందుకు చర్యలు తీసుకుంటుండ గా, రై తుల ను మోసం చేసి అధిక ధరలకు యూరి యాను విక్రయి స్తున్నందుకు గాను పై ముగ్గురిపై బి ఎన్ ఎస్ ఆక్ట్ (భారతీయ న్యా య సంహిత), సెక్షన్ 318 (4)నిత్యావసర వస్తువుల చట్టం సెక్ష న్-7, ఎరువుల నియం త్రణ ఆర్డర్ చట్టం-1957, సెక్షన్19, తదిత ర చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
యూరియాను అధిక ధరలకు విక్ర యించడం, పక్కదారి పట్టించ డం, అక్రమాలకు పాల్పడడం వంటి చ ర్యలకు ఎవరు పాల్పడినా సహించ బోమని, అలాంటి వారిపై కఠిన చ ర్యలు తీసుకొంటామని, అవసరమై తే పిడి ఆక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.