District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ, అనవసరమైన చోట ఎట్టి పరిస్థి తులలో యూరియాను డంపు చే యవద్దని ఆదేశం
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: జిల్లాలో అ వసర మున్నచోటనే యూరియాను ఇవ్వాలని, అనవసరమైన చోట ఎ ట్టి పరిస్థితులలో యూరియాను డం పు చేయవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించా రు. మంగళవారం ఆమె నల్గొండ జి ల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆగ్రో ఏ జెన్సీ ఎరువుల దుకాణాన్ని,గో దా మును ఆకస్మిఖంగా తనిఖీచే శా రు.ఇప్పటివరకు అమ్మిన యూరి యా, ఇతర ఎరువుల వివరాలను, స్టాక్ రిజిస్టర్, ఆన్లైన్ లో పరిశీలిం చారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు రైతుల అ వసరాన్ని దృష్టిలో ఉంచుకొని అవ సరం ఉన్నంత మేరకే యూరియా ను ఇవ్వాలని ,ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ అధికారు లు తహసిల్దారు కలిసి పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకున్న త ర్వాతనే యూరియాను కేటాయిం చాలని, అవసరం లేని చోట ఎట్టి పరిస్థితులలో యూరియాను డంప్ చేయవద్దని చెప్పారు.ఎవరైనా వ్య వసాయానికి కాకుండా ఇతర అవస రాలకు యూరియా వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, అ వసరమైతే క్రిమినల్ కేసులు నమో దు చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే యూ రియాను అమ్మాలని చెప్పారు. యూరియా, ఇతర ఎరువుల సక్ర మ సరఫరాకు ఏర్పాటు చేసిన టా స్క్ ఫోర్స్ బృందాలు ఎప్పటికప్పు డు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ త నిఖీలు చేయాలని అలాగే వ్యవసా య అధికారులు ఎరువుల దుకాణా లను తనిఖీ చేసి యూరియా దుర్వి నియోగం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అవసరమై న మేర యూరియా వాడే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.నల్గొండ ఆర్డీవో వై అ శోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ స య్య ద్ ముసాబ్ అహ్మద్, తదిత రులు ఉన్నారు.