Politicsతెలంగాణనల్గొండ

District SP Sharath Chandra : నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర హెచ్చరిక, తరచూ దొంగతనాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి 

District SP Sharath Chandra : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా పరిధిలో ఇటీవల కాలంలో త రచూ దొంగతనాలు,చోరీలు, చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల చోరీ లు, ఇళ్లలో చోరీలు వంటి నేరాలకు పాల్పడుతున్న అలవాటైన నేరస్తు లపై జిల్లా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు.

జిల్లాలో గతంలో దొంగతనాలకు పా ల్పడిన వ్యక్తులందరినీ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి హాజరు పరచి కౌన్సి లింగ్ కార్యక్రమం నిర్వహించి, నేరా లకు దూరంగా ఉండి సత్ప్రవర్తన తో నేరాలను మానుకొని, సమాజం లో గౌరవప్రదమైన, చట్టబద్ధమైన జీ వితం గడపాలని వారికి సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లా డుతూ జిల్లాలో నేరాలకు అలవా టుపడిన వ్యక్తుల కదలికలపై పోలీ స్ శాఖ ఇప్పటికే ప్రత్యేక నిఘా బృం దాలు, నైట్ పెట్రోలింగ్ టీములు, సీ సీటీవీ నిఘా వ్యవస్థల ద్వారా నిరం తర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తరచూ నే రాలకు పాల్పడుతున్న నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, అనుమానితు ల పై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్ల డించారు.

తరచూ నేరాలకు పాల్పడుతున్న నిందితులు తమ ప్రవర్తనను వెంట నే మార్చుకోకపోతే ప్రివెంటివ్ డిటె న్షన్ యాక్ట్ (PD Act), రౌడీషీట్‌లు, బైండోవర్ కేసులు, కఠిన చట్టాల కిం ద అరెస్టులు మరియు రిమాండ్ వంటి చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కఠినంగా హెచ్చరించారు. ప్రజల ఆ స్తి, ప్రాణ భద్రతలకు ముప్పుగా మా రే నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

అలాగే దొంగతనాలకు పాల్పడే ము ఠాలు, తిరుగుబాటు నేరస్తులు, అం తర్రాష్ట్ర నేరస్తులపై ప్రత్యేక ఆపరే షన్లు నిర్వహించి వారి నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించే దిశగా చర్యలు తీ సుకుంటున్నామని తెలిపారు. ప్ర జ లు కూడా తమ ఇళ్ల వద్ద భద్రతా చ ర్యలు తప్పనిసరిగా పాటించాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసు కోవాలని, పొరుగువారితో సమన్వ యం ఉంచాలని సూచించారు. ఏదై నా అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే డయల్ 100 లే దా సమీప పోలీస్ స్టేషన్‌కు వెంటనే సమాచారం అందించాలని కోరారు.

జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షిం చడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్య మని, నేరాలపై జీరో టాలరెన్స్ వి ధానంతో పని చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. దొంగతనాలకు పా ల్పడుతున్న వారు సత్ప్రవర్తనతో నేరాలను మానుకొని ఉపాధి మా ర్గాల వైపు అడుగులు వేయాలని, అలాంటి వారికి పోలీస్ శాఖ తరఫు న అవసరమైన సహాయ సహకా రాలు అందించేందుకు సిద్ధంగా ఉ న్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ స్పష్టం చేశారు.

Related Articles

Back to top button