Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Shannu NIFA Award : నల్లగొండ జిల్లా పేదింటి ఆడబిడ్డకు జాతీయ అవార్డు, ఢిల్లీలో ‘నిఫా’ పురస్కారం అందుకున్న షన్ను 

Shannu NIFA Award :  ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: నల్లగొండ జిల్లాకు చెందిన పేదింటి ఆడబిడ్డ కు ప్రతిష్టాత్మక జాతీయ పురస్కా రం లభించింది. నల్లగొండ జిల్లా గు డిపల్లి మండల కేంద్రానికి చెందిన షేక్ షన్ను నిఫా (NIFAA- నేషనల్ ఇంటిగ్రెటెడ్ ఆఫ్ ఆర్టిస్ట్స్ అండ్ ఆక్టి విస్ట్) జాతీయ స్థాయి పురస్కారం అందుకుంది. మంగళవారం రాత్రి ఢి ల్లీలోని భారత మండపంలో జరి గి న కార్యక్రమంలో ఆ సంస్థ అధిపతి ప్రిత్‌పాల్ సింగ్ పన్ను షేక్ షన్నుకు అవార్డును అందజేశారు.

గత కొన్నేళ్లుగా సమాజ సేవలో ని బద్ధతతో పనిచేస్తూ వచ్చిన నేప ద్యంలో ఆమెకు ఈ జాతీయస్థాయి గౌరవం దక్కింది. కాగా, షేక్ షన్ను నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS)లో భాగంగా 2024 భారతదేశ రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ లో పాల్గొని కర్తవ్య ప త్ దగ్గర కవాతు చేసి ఎంతో మంది ఆడపిల్లలకు మనోధైర్యాన్ని నింపిం ది. షన్నుకు ప్రతిష్ఠాత్మక అవార్డు ద క్కిన సందర్భంగా ఆమె చదు వు కున్న కళాశాల అధ్యాపకులు, తల్లి షేక్ హసీనా, బంధుమిత్రులు హర్షం వ్యక్తంచేస్తూ అభినందనలు తెలి యజేశారు.

ఇదిలా ఉండగా చిన్నతనంలోనే ష న్ను తండ్రి చనిపోవడంతో తల్లి హ సీనా కూలిపనులు చేసుకుంటూ కు టుంబాన్ని పోషిస్తోంది. కాగా, ప్రస్తు తం వీరు నల్లగొండ మండల జీకే అ న్నారం గ్రామంలో నివసిస్తున్నారు.