Nalgonda police dog farewell : పోలీస్ జాగిలానికి నల్లగొండ పోలీ సుల కన్నీటి వీడ్కోలు, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
Nalgonda police dog farewell : ప్రజాదీవెన, నల్లగొండ:విధి నిర్వ హణలో అలుపెరుగని సేవలందించి న నేర పరిశోధనలో సాటి లేని జా గిలం, వాసన పసిగట్టిందంటే వదిలి పెట్టని నైజం. అనేక కీలక కేసులలో నేరస్థులను డిటెక్ట్ చేసి పోలీస్ శా ఖకు వెన్ను దన్నుగా నిలిచి దాదా పు 12 సంవత్సరాల కాలం పాటు విధి నిర్వహణలో విశేష సేవలు అం దించి అనారోగ్య కారణంగా ఆదివా రం మరణించింది. పింకీ మరణం పట్ల జిల్లా ఎస్పీ ఎస్పీ శరత్ చంద్ర పవార్ విచారణ వ్యక్తం చేశారు. జి ల్లా పోలీస్ శాఖలో డాగ్ స్క్వాడ్ లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ జా గిలం పింకీ అనారోగ్యంతో బాధప డుతూ ఆదివారం తుది శ్వాస విడి చింది.
2014 సంవత్సరంలో ఐఐటీ మొ యినాబాద్ లో 9 నెలల పాటు డాగ్ హ్యాండ్లర్ నాగరాజు తో పాటు శిక్ష ణ పొంది శిక్షణా కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధిం చింది.
*పింకీ సాధించిన విజయాలివే*
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విధిని ర్వహణలో భాగంగా నల్లగొండ 1 టౌన్ పరిదిలో బొట్టుగూడలో ఒక వ్యక్తిని ముక్కలు ముక్కలుగా చేసి పలు చౌరస్తాలలో తల మొండెం వే రు చేసిన సంచలన హత్య కేసులో కీలకమైన పాత్ర పోషించింది. అదే విధంగా నల్లగొండ జిల్లా కేంద్రం లో జూలకంటి ఇంద్ర రెడ్డి ఫంక్షన్ హల్ వద్ద జరిగిన 1కోటి 40 లక్షల రూపా యల చోరీ కేసులో గంటల వ్యవధి లో నిందితుల జాడలను పసిగట్టిం ది. గుండాల మండలంలోని వంగా ల గ్రామంలో ఒక వ్యక్తిని చంపి బావి లో పడవేసిన వారం రోజుల తరు వాత విషయం తెలుసుకున్న తరు వాత ఈ డాగ్ తో అన్వేషణ చేస్తే నిందితుల ఇండ్ల లోకి వెళ్లి పసిగ ట్టింది.ఇలా పింకీ విధినిర్వహణలో చేసిన సేవలు మరువలేనివి.
విధి నిర్వహణలో అనేక సేవలు అందించిన పింకీ జాగీలం భౌతిక కా యానికి జిల్లా ఎస్పీ సూచనల మేర కు అడి షనల్ ఎస్పి రమేష్ పూల మాల వేసి నివాళులు అర్పించి శ్ర ద్ధాంజలి ఘటించి అధికార లాంఛ నాలతో అంత్య క్రియలు నిర్వహిం చారు.ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డి ఎస్పి శ్రీనివాసులు, ఆర్ఐ సంతోష్, ఆర్ ఎస్ .ఐ రాజీవ్, డాగ్ హ్యాండ్లర్ నాగరాజు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది కరుణాకర్, సంపత్, సతీష్, గోపా ల్, మహేంద్ర, నరేష్, ఇతర అధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు.