Praja Deveena
Newspaper Banner
Date of Publish : 20 January 2026, 12:29 pm Posted by : praja deveena

SP Sharath Chandra : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర కీలక వ్యాఖ్య, హెల్మెట్ ట్రాఫిక్ నిబంధన మాత్రమే కాదు ప్రాణరక్షణ సాధనo కూడా

SP Sharath Chandra : ప్రజా దీవెన, నల్లగొండ: హెల్మెట్ ధ రించడం ద్వారా ప్రాణాలను కాపా డుకునే అవకాశం ఎంతో ఎక్కువగా ఉంటుందని, హెల్మెట్ అనేది కేవలం ట్రాఫిక్ నిబంధన మాత్రమే కాకుం డా ప్రాణరక్షణకు అత్యంత కీలకమై న సాధనమని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నియం త్రించడమే లక్ష్యంగా నల్లగొండ జి ల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మం గళవారం అరైవ్ అలైవ్ (Arrive Ali ve – 2026) కార్యక్రమంలో భాగం గా కళాశాల విద్యార్థులు, యువత, ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ బస్ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా అ నేక మంది రోడ్డు ప్రమాదాల్లో గాయ పడుతూ ప్రాణాలు కోల్పోతు న్నా రని ఆందోళన వ్యక్తం చేశారు. న ల్గొండ జిల్లా పరిధిలో గత సంవ త్స రం నమోదైన గణాంకాల ప్రకారం జి ల్లాలో సుమారు 900 నుంచి 950 వరకు రోడ్డు ప్రమాదాలు చోటుచేసు కోగా అందులో దాదాపు 360 మం ది ప్రాణాలు కోల్పోయారని తెలిపా రు. ఈ మరణాల్లో సుమారు 90 శా తం మంది ద్విచక్ర వాహనదారులే కాగా వారిలో హెల్మెట్ ధరించకపో వడమే ప్రధాన కారణమని వెల్లడిం చారు.

అలాగే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా అతివేగం, మద్యం సే వించి వాహనం నడపడం (డ్రంక్ అండ్ డ్రైవ్), ట్రాఫిక్ నియమాల ఉ ల్లంఘన, మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించ కపోవడం వంటి అంశాలను ఎస్పీ వివరించారు. ఇవన్నీ నియంత్రిస్తే ప్ర మాదాల శాతం గణనీయంగా తగ్గు తుందని తెలిపారు.

18 సంవత్సరాలు నిండకముందే వాహనాలు నడపడం చట్టరీత్యా నే రమని, మైనర్ డ్రైవింగ్ వల్ల ప్ర మా దాల సంఖ్య పెరుగుతోందన్నారు. అలాగే మద్యం సేవించి వాహనం నడిపితే కేవలం డ్రైవర్‌కే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమా దం ఏర్పడుతుందని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.

రోడ్డు భద్రత అనేది పోలీసుల బా ధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరు డి బాధ్యత అని జిల్లా ఎస్పీ తెలి పారు. ట్రాఫిక్ నియమాలను పాటి స్తే తాము సురక్షితంగా ఉండటమే కాకుండా, ఇతరుల ప్రాణాలను కూ డా కాపాడిన వారవుతామని అన్నా రు. పోలీసులు శిక్షించడానికి కాదు, ప్రజల ప్రాణాలను కాపాడేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు.

ఈ అవగాహనా సదస్సులో రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు తక్షణ ప్రాథమిక చికిత్సలో భాగంగా డాక్టర్ ద్వారా సీపీఆర్ (CPR) పై అవగా హన కల్పించబడింది. ప్రమాదర హి త ప్రయాణానికి ప్రతి ఒక్కరం కృషి చేస్తామని పాల్గొన్న వారందరూ ప్ర తిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్‌బి డీఎస్పీ మల్లారెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివారెడ్డి, 2 టౌన్ సీఐ రాఘవరావు, 1 టౌన్ సీఐ రా జశేఖర్ రెడ్డి, ఎస్‌బి సీఐ రాము, ట్రా ఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, 2 టౌన్ ఎ స్‌ఐ సైదులు, రూరల్ ఎస్‌ఐ సైదా బాబు,ఆర్టీసీ డియం డీటీఆర్‌బీ రి టైర్డ్ సీఐ అంజయ్య తదితర పోలీ స్ అధికారులు, సిబ్బంది, ఆటో డ్రై వర్లు, బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.