Nalgonda SP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ, వినాయక మండ పాల వద్ద విస్తృత పర్యటన
Nalgonda SP Sharath Chandra Pawar :
ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ, నకిరేకల్ పట్టణ కేంద్రంలో పలు వి నాయక మండపాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం ఆక స్మిక తనిఖీ చేశారు. జిల్లాలో శాంతి యుత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచిస్తూ ఆయా ప్రాంతాల్లో గణేష్ మండపాల వద్ద విస్తృతంగా పర్య టించారు. జిల్లాలో వినాయక నవ రాత్రి ఉత్సవాల కార్యక్రమాల బా గంగా నిర్వాహకులు ఏర్పాటు చే సిన పలు వినాయక మండపాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.
జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు శాం తియుతంగా ప్రశాంత వాతావరణం ఏలాంటి అవాంఛనీయ సంఘటన లు చోటుచేసుకోకుండా నిమజ్జనం వరకు పోలీస్ యంత్రాంగం అన్ని ర కాల భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందనీ తెలిపారు. జిల్లాలో అధి కారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అప్ర మత్తంగా ఉంటూ, పెట్రో కార్, బ్లూ క్లోట్స్ సిబ్బంది, 24/7 పెట్రోలింగ్ ని ర్వహించడం జరుగుతుందనీ తెలి పారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు విద్యు దీకరణ జాగ్రత్తగా చేపట్టాలని సూ చించారు.
ప్రతి మండపాల వద్ద నిర్వాహకులు అందుబాటులో ఉండాలని అన్నా రు. ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు చోటు చేసుకోకుండా ముం దస్తుగా మండపాల వద్ద సిసి కెమె రాలు ఏర్పాటు చేసుకోవాలని తెలి పారు. ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠి నమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ పలు జాగ్రత్తలపై నిర్వ హులకు సూచించారు. ఏమైనా అ నుకోని సంఘటనలు జరిగితే తక్ష ణమే పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు. నిమ జ్జనం వరకు పోలీస్ వారి సూచ న లు సలహాలు పాటిస్తూ సహకరిం చాలనీ కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట నల్ల గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, యస్బి సిఐ రాము,నల్లగొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తదితరులున్నారు.