Nalgonda SP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ పవార్ కీలక ప్రకటన, నేరనియంత్రణ కోసం కమ్యూని టీ కాంటాక్ట్ ప్రోగ్రాo
Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నకిరేకల్: నకిరేకల్ పట్టణ పరిధిలో మంగళవారం తెల్ల వారు జామున నల్లగొండ డీఎస్పీ ఆ ధ్వర్యంలో 5 మంది సీఐలు , 20 మంది ఎస్ఐ లతో పాటు TGSP సి బ్బంది 50 మందితో మొత్తం కలిపి 300 మంది పోలీస్ సిబ్బందితో దా దాపు 350 ఇళ్లల్లో సోదాలు నిర్వ హించగా సరియైన పత్రాలు లేని మొత్తం 130 వాహనాలు పట్టుబ డ్డాయి. వీటిలో 120 ద్విచక్ర వాహ నాలు,10 త్రీచక్ర వాహనాలు,08 మంది అనుమానితులను గుర్తించ డం జరిగిందని ఇందులో ఒక ఆస్తి సంబంధిత నేరస్తున్నీ అదుపులో తీ సుకోవడం జరిగిందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలి పారు. అదే సందర్భంలో ఇతర దే శాలు నేపాల్ నుంచి వచ్చిన ము గ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వీరికి సంబంధించి పత్రాలు పరిశీలించడం జరుగుతుం దన్నారు.
ఒక షెడ్ లో అక్రమంగా ఉంచిన 15 ఆవు దూడలు కూడా పట్టుబడి చేయడం జరిగిందనీ వీటిని చట్టప్ర కారం గోశాలకు తరలించడం జరు గుతుందన్నారు. అలాగే 18 గంజా సేవించినట్లుగా అనుమానితులను అదుపులోకి తీసుకొని వీరందరికీ ప రీక్షలు నిర్వహించడం జరుగుతుం దని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యంగా ముందస్తు నేర నియం త్రణ చర్యల్లో భాగంగా కమ్యూనిటి కాంటాక్టులాంటి కార్యక్రమాలు నిర్వ హించడం జరుగుతుందని దీనిలో భాగంగా మంగళవారం తెల్లవారు జామున నకిరేకల్ పట్టణంలో కార్డె న్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వ హించామని తెలిపారు. కాలనీల్లో ఇంటి ప్రదేశాల్లో అనుమానితంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాల ని కోరారు. కొత్తగా ఇండ్లకు కిరాయి లకు వచ్చే వారి పూర్తి వివరాలు తె లుసుకున్నాకే ఆద్దెలకు ఇవ్వాలని సూచించారు. నేరరహిత పట్టణం గా తీర్చి దిద్దడంతోపాటు ప్రజలకు శాంతిభద్రతలు కల్పించాలని గం జాయి తదితర మాదకద్రవాలను నిలువరించడం కోసం కృషీ చేస్తు న్నామని తెలిపారు. జిల్లాలో గం జాయిని ఆరికట్టడం కోసం మూడు దశల్లో కార్యాక్రమాలను నిర్వహిస్తు న్నామని చెప్పారు. ఎక్కడైన గంజా యి సేవిస్తున్నట్లు,విక్రయించినట్లు, కానీ రవాణా చేస్తున్నట్లు కానీ తెలి స్తే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించా రు. వారి వివరాలు గోప్యంగా ఉం చుతామని చెప్పారు.
తప్పుడు డాక్యుమెంట్లతో ఉన్నవా రిని అదుపులోకి తీసుకున్నట్లు తె లిపారు.జిల్లాలో అసాంఘిక కార్య క్రమాలు జరగకుండా, నేర నియం త్రణకు ఇలాంటి కార్యక్రమాలు ని ర్వహిస్తామని ఈ సందర్భంగా తెలి పారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివ రాం రెడ్డి,సీఐలు రాఘవరావు, ఆది రెడ్డి, కొండల్ రెడ్డి, కరుణాకర్, మ హాలక్ష్మయ్య, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.