Praja Deveena
Newspaper Banner
Date of Publish : 30 December 2025, 1:18 pm Posted by : praja deveena

SP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక ప్రకటన,జనవరి 1నుంచి ఆప రేషన్ స్మైల్ XII ప్రత్యేక తనిఖీలు

SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తప్పిపోయిన, ని రాదరణకు గురైన, వెట్టి చాకిరీకి గు రవుతున్న పిల్లలను గుర్తించి రక్షించి వారి భవిష్యత్తును కాపాడే లక్ష్యం తో ఆపరేషన్ స్మైల్ – XII కార్యక్ర మాన్ని పోలీస్ శాఖ విజయవంతం గా అమలు చేస్తోందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలి పారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యా లయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన ఆపరే షన్ స్మైల్ సమావేశంలో జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, జనవరి 1 నుంచి 31 వరకు నెల రోజుల పా టు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తని ఖీ లు నిర్వహించనున్నట్లు స్పష్టం చే శారు.

నిరాదరణకు గురైన, తప్పిపోయిన, వెట్టి చాకిరీకి గురవుతున్న బాల బా లికలను గుర్తించి వారిని సంరక్షిం చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జనవరిలో ఆపరేషన్ స్మైల్ జూలై లో ఆపరేషన్ ముస్కాన్ కార్య క్ర మాలను నిర్వహిస్తున్నట్లు తెలిపా రు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ డివిజన్‌ల పరిధిలో మూడు ప్రత్యేక బృందాల ను ఏర్పాటు చేసి, పోలీస్ అధికారు లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC), లే బర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపా ర్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారుల సమ న్వయంతో విస్తృత తనిఖీలు నిర్వ హించనున్నట్లు ఎస్పీ వివరించారు.

బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, మార్కె ట్ ప్రాంతాలు, కిరాణా దుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, లాడ్జ్‌ లు, ధాబాలు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, మినరల్ వాటర్ సరఫరా కేంద్రాలు, వర్క్‌షాప్‌లు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి, 18 సం వత్సరాల లోపు తప్పిపోయిన లే దా వదిలివేయబడిన పిల్లలు, వివి ధ రకాల బాల కార్మికులు, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తిం చి, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించడం లేదా అవసర మైతే స్టేట్ హోమ్‌కు పంపించడం జ రుగుతుందని తెలిపారు.

 

పిల్లలతో బలవంతపు పని చేయిం చడం, వెట్టి చాకిరీ చేయించడం, వా రి స్వేచ్ఛకు మరియు వికాసానికి భంగం కలిగించడం చట్టరీత్యా ఘో ర నేరమని హెచ్చరిస్తూ, అటువంటి ఘటనల్లో పాల్పడే వ్యక్తులు, యా జమాన్యాలపై చైల్డ్ లేబర్ యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం క్రిమి నల్ కేసులు నమోదు చేసి కఠిన చ ర్యలు తీసుకుంటామని స్పష్టం చే శారు.

 

ఎక్కడైనా పిల్లలు వెట్టి చాకిరీకి గుర వుతున్నట్లు, బాల కార్మికులుగా ప నిచేస్తున్నట్లు కనిపిస్తే వెంటనే 109 8 చైల్డ్‌లైన్ లేదా డయల్ 100 కు స మాచారం అందించాలని, బాల కా ర్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒ క్కరూ బాధ్యతగా సహకరించాలని ఎస్పీ ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ కృష్ణయ్య, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అరుణ, వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హరిత , డిస్టిక్ ఎడ్యుకే షన్ ఆఫీసర్ బిక్షపతి, ఏ.హెచ్. టి. యూ ఎస్. ఐ రంగారెడ్డి, చైల్డ్ ప్రొటె క్షన్ ఆఫీసర్ గణేష్,హెల్త్ డిపార్ట్మెం ట్‌, వివిధ శాఖల అధికారులు పా ల్గొన్నారు.