Nalgonda SP Sharath Chandra Pawar : నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రప వార్ అప్పీల్,ప్రశాంత శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు
Nalgonda SP Sharath Chandra Pawar :
ప్రజా దీవెన, నల్లగొండ: రానున్న వి నాయక చవితి నవరాత్రి ఉత్సవా లు జిల్లాలో ప్రశాంత శాంతియుత వాతావరణం, భక్తి శ్రద్ధలతో జరుపు కోవాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ అప్పీల్ చేశారు.
ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దం కలిగించే లౌడ్ స్పీకర్లు,డి.జె లకు అనుమతి లేదని జిల్లా ఎస్పి శనివారం విడుదల చేసిన ఓ పత్రి కా ప్రకటనలో పేర్కొన్నారు.
డిజే నిర్వాహకులు ఎట్టి పరిస్థితు ల్లోనూ వినాయక మండపల వద్ద గాని ఊరేగింపులకు గాని డి.జేలు ఏర్పాటు చేయకూడదన్నారు. గణే ష్ విగ్రహాల వద్ద నిర్వాహకులు స్పీ కర్లను తక్కువ సౌండ్ తో రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియో గించాలని, ఎవరైనా నిర్వాహకులు లౌడ్ స్పీకర్లు, డి.జె. సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే వారిపై చర్యలు తీ సుకోవడం జరుగుతుందని అన్నా రు.అదే విధంగా పాఠశాలలు, కళా శాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాల కు మరియు ఇతర ప్రార్థనా మంది రాలకు ఇబ్బంది కలిగేలా చేయ రాదన్నారు.
మండప నిర్వాహకులు ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందు లు కలగకుండా విగ్రహాలను రోడ్డు కు ఇరుపక్కల ప్రతిష్టించుకోవాలనీ సూచించారు.సోషల్ మీడియాలో ఇతర మతాల వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్టులు చేస్తే క ఠిన చర్యలు తప్పవని హెచ్చరించా రు. సోషల్ మీడియా పై ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయ డం జరిగిందని తెలిపారు.మండప నిర్వహుకులు అవసరమైన అన్ని శాఖల అనుమతులు తీసుకోవాల ని కోరారు. వినాయక విగ్రహాల ఏ ర్పాటు చేయుటకు నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in/index.htm సైట్ లో వివ రాలు పొందుపరిచి అప్లికేషన్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్‌లో అం ద జేయాలని సూచించారు.వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీ సు వారి చూచనలు పాటిస్తూ సహ కరించగలరని కోరారు.
గణేష్ మండప నిర్వాహకులు పా టించవలసిన నిబంధనలు ఇవే
–మండపం ఏర్పాటు చేయు స్థలం వారి యాజమానుల అనుమతులు తీసుకోవాలి.
–గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలి.
–షార్ట్ సర్క్యూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరు ఉప యోగించాలి.
–గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లను మం డపంలో ఏర్పాటు చేయాలి.
–గణేష్ మండపాలను ఎవరికి ట్రా ఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చే సుకోవాలి.
–గణేష్ ప్రతిమలు కూర్చుండబెట్టే ప్రదేశంలో మంచి నాణ్యత గల స్టే జ్ మరియు షెడ్ ఏర్పాటు చేయ వలెను.
–గణేష్ మండపంలో 24 గంటలు ఇద్దరు వాలంటీర్ ఉండే విధంగా ని ర్వహకులు తగు చర్యలు తీసుకో వాలి.
–గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శన దృష్టిలో ఉంచుకుని, మండపాలలో భక్తుల కోసం క్యూలై న్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలి.
–గణేష్ మండపాల వద్ద మద్యం సే వించడం, పేకాట అడటం, అస భ్య కరమైన నృత్యాల ఏర్పాటు, అన్య మతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం, పాటలు పా డటంపై పూర్తిగా నిషేధం.
–విధిగా పాయింట్ పుస్తకం ఏర్పా టు చేసుకోవాలి, పోలీసు అధికా రుల తనిఖీకి వచ్చినప్పుడు అం దులో వ్రాసి సంతకం సూచనలు చేస్తారు.
–ప్రతి మండపం వద్ద సీసీ కెమెరా లు విదిగా ఏర్పాటు చేసు కోవాలి.
–మండపాల్లో ఏదైనా అనుమానా స్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచు లు, వస్తువులు లేదా వ్యక్తులు కని పించినట్లయితే తక్షణమే డయల్ 100 గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.
–సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకూడదు, ఎవ్వరికైనా ఎలాం టి సందేహాలు ఉన్నా సంబంధిత పోలీసు వారికి లేదా డయల్ 100 కి సమాచారం అందించాలి.