Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nampally Chandramouli: జిపి కార్మికుల వేతనాలను వెంటనే విడుదల చేయాలి

–నాంపల్లి చంద్రమౌళి ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు

Nampally Chandramouli:ప్రజా దీవెన, నాంపల్లి: పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాల ని మల్టీపర్పస్ విధానం రద్దు చేయా లని ప్రజానాట్యమడలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి (Nampally Chandramouli)ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాంపల్లి ఎంపీడీవో ఆఫీస్ ముందు గ్రామపంచాయతీ కార్మికుల (Gram panchayat workers) సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సంద ర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి పాల్గొని మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు (Gram panchayat workers) 7 నేలల నుంచి 18 నేలల పెండింగ్లో వేతనాలు ఉండడంతోటి ఇల్లు గడిచే పరిస్థితిలో లేక కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే పెండింగ్ జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జీతాలకు స్పెషల్ గ్రాంట్ (Special Grant) ఏర్పాటు చేయాలని మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కనీస వేతనం 26 వేల రూపాయలను నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలతో కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని తీవ్ర ఇబ్బం దులకు గురవుతా ఉన్నా మని కార్మికులు ఆందోళన చెందారు ఇంటిదగ్గర నిత్యవసర వస్తువులు కొనే స్థితి లేక రెషన్ బియ్యం (ration rice) తెచ్చుకొని గడుపుతున్నామని పిల్లల చదువులకు కనీసం పుస్తకాలు కొన లేని స్థితిలో లేమని వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారని ఆయన అన్నారు ధర్నా అనంతరం ప్రజా పాలనలో కార్మికుల డిమాండ్లతో కూడిన వినతిపత్రం మండల పంచాయతీ అధికారి ఎంపీ ఓ ఎస్ ఝాన్సీకి (Panchayat Officer MP OS Jhansi)ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు పల్లేటి హరికృష్ణ, నాంపల్లి నరేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు గాదెపాక మరియమ్మ, బుషిపాక వెంకటయ్య, గణేష్, రోశయ్య, వెంకటయ్య, ఎల్లయ్య, లక్ష్మణ్, బిక్షమయ్య, రాములమ్మ, ఈరమ్మ, పార్వతమ్మ, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.