ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి
Nampally Chandramouli: ప్రజా దీవెన నాంపల్లి: కార్మికులను బానిసలుగా చేసేటటువంటి లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం రోజున నాంంపల్లి మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా వరకు నల్ల జండా తో నిరసన తెలిపారు ఈ సందర్భంగా నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. వారి లాభాల కోసమే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తుందన్నారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను 4 లేబర్ కోడ్స్ మార్పు చేయడం దుర్మార్గమన్నారు. ఈ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు బానిసలుగా మారతారని అన్నారు.
ఈ కోడ్స్ వల్ల కార్మికులు సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, జీతభత్యాలు బేరమాడే హక్కు పనిగంటలు విపరీతంగా పెరుగుతాయనీ వెంటనే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కనీస వేతనం 26000 అమలు చేసి ఆశ వర్కర్లను పర్మినెంట్ చేయాలని గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఆశ వివోఏ మధ్యాహ్న భోజనం అంగన్వాడి వర్కర్స్ లో సమస్యలు అసంఘటితరంగా కార్మికులకు రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని హెచ్చరించారు *ఈ కార్యక్రమంలో సిఐటియు అన్ని రంగాల కార్మికులు ఆశా వర్కర్స్ జిపి కార్మికులు. ఆశా కార్యకర్తలు కవిత, లలిత, సునీత కవిత, విజయలక్ష్మి, అరుణ, సైదమ్మ, మరియమ్మ, ఎల్లయ్య సులోచన రాములమ్మ, రామస్వామి, ఈరమ్మ, లక్ష్మణ్, వెంకటయ్య, స్వామి, సాయిలు, మంగి, జగతయ్య, బాల్కోటి, రవితేజ, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు;