–మెగా హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం
Nandi Award : ప్రజా దీవేన,కోదాడ: కోదాడ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త గుండెపంగు రమేష్ చేసిన విశిష్ట సామాజిక సేవలను గుర్తించిన హైదరాబాద్ కు చెందిన మెగా హెల్పింగ్ ఫౌండేషన్ వారుజాతీయ ఉత్తమ్ సోషల్ వర్కర్ గా బంగారు నంది అవార్డు ప్రకటించింది. కోదాడకు చెందిన గుండెపంగు రమేష్ కు ఈ పురస్కారం దక్కడంపై పట్టణానికి చెందిన ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు.శనివారం హైదరాబాదులోని బిఎం బిర్లా సైన్స్ మ్యూజియంలో వివిధ రంగాల సామాజిక సేవలలో విశిష్ట సేవలు అందించిన, వారికి జాతీయ పురస్కారాలు పేరిట బంగారు నంది అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా సినీ నటుడు,కమెడియన్,పొలిటీషియన్ బాబుమోహన్ చేతుల మీదుగా ఉత్తమ సోషల్ వర్కర్ గా జాతీయ పురస్కారం,బంగారు నంది అవార్డును అందుకున్నట్లు అవార్డు గ్రహీత గుండెపంగు రమేష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి రక్తదానం, నేత్రదానం లాంటి సేవా కార్యక్రమాలే కాకుండా ఎన్నో సామాజిక,సంక్షేమ,సేవా కార్యక్రమాలను చేశానని, వ్యక్తిగతంగా 50 సార్లు రక్తదానం చేసి,6వేల యూనిట్ల రక్తాన్ని దాతలు నుండి సేకరించి,రక్తం అవసరమైన రోగులకు,ఆపరేషన్ నిమిత్తం రక్తం అవసరమైన వారికి,రక్తహీనతతో బాధపడుతున్న రోగులకు, యాక్సిడెంట్లో ప్రమాదాల ద్వారా రక్తాన్ని కోల్పోయినవారికి, స్వచ్ఛందంగా ఉచితంగా రక్తదానం చేయించడం జరుగుతుందని,ఇవేకాక మొక్కలు నాటడం,ఎయిడ్స్ పై అవగాహన సదస్సులు,నేత్రదాన కార్యక్రమాలు,రక్తదాతలకు అవార్డుల ప్రధానోత్సవం,ప్రమాద భీమా పట్టాలు పంపిణి,జాతీయ నాయకుల జయంతులు, వర్ధంతులు లాంటి ఎన్నో సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నందుకు గాను మెగా హెల్పింగ్ ఫౌండేషన్ వారు నా సేవలను గుర్తించి జాతీయ పురస్కారం,బంగారం నంది అవార్డుతో సత్కరించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.