–సీఆర్డీయే రైతు కూలీ పెన్షన్ అందించి ఆదుకోవాలి
–వారసత్వంగా వచ్చిన మూడెకరా ల అసైన్డ్ భూమిని వైసీపీ అండతో కబ్జా చేశారు
–22వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు వినతుల వెల్లువ
Nara Lokesh: ప్రజా దీవెన,అమరావతిః సమస్యలు పరిష్కరించాలంటూ ఉండవల్లిలోని విద్య,ఐటీ,ఎల క్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కు వినతులు వెల్లువెత్తాయి. మంత్రి లోకేష్ ను నేరుగా కలిసి సమస్యలు విన్నవించేందుకు జోరువానను సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. 22వ రోజు “ప్రజాదర్బార్” లో ప్రతిఒక్కరి కష్టాన్ని విన్న మంత్రి.. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలు విజ్ఞప్తులపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
మంగళగిరి 17వ వార్డుకి చెందిన ఓసూరి వెంకయ్య మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ను కలిశారు. గౌతమ బుద్ధా రోడ్డులో నివాసముండే తన ఇంటిని గత వైసీపీ ప్రభుత్వం రోడ్డు వెడల్పు పేరుతో సగభాగం కూల్చారని, ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా విద్యుత్ ట్రాన్స్ ఫారమ్ కూడా ఏర్పాటుచేశారన్నా రు. తమ సమస్యను పరిష్కరించా లని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.మంగళగిరి నియోజకవర్గం (Mangalagiri Constituency)ఉండవల్లి హరిజన వాడకు చెందిన జే.ప్రియాంక మంత్రి నారా లోకేష్ ను కలిశారు. భర్త చని పోయి ఇబ్బందులు పడుతు న్నాన ని, తన ఇద్దరు పిల్లల భవిష్యత్ కోసం సీఆర్డీయే రైతు కూలీ పెన్షన్ అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.పుట్టకతో దివ్యాంగుడైన తనకు ఎలాంటి ఆధారం లేదని, అంగన్ వాడీ ఉద్యోగం చేసే తన సతీమణి గతేడాది మరణించిందని ఉండవల్లికి చెందిన శిఖా శేఖర్ బాబు మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. తన ఇద్దరు కుమార్తెలకు ఉద్యోగం కల్పించడంతో పాటు టిడ్కో ఇంటిని మంజూరు చేసి ఆదుకోవాలని విన్నవించారు.
సదరు అర్జీని (application)పరిశీలించిన మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంగళగిరికి చెందిన ఆర్.అశోక్ బాబు అనే కాంట్రాక్టర్ మంత్రి నారా లోకేష్ ను కలిసి తన సమస్యను వివరించారు. తాడేపల్లి, తెనాలి మున్సిపాలిటీ పరిధిలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద పూర్తిచేసిన సివిల్ పనులకు గత వైసీపీ ప్రభు త్వం బిల్లులు చెల్లించకపో వడంతో తీవ్రంగా నష్టపోయానని తెలిపారు. అధికారులకు పలుమార్లు విన్నవిం చినా పట్టించుకోలేదన్నారు. బిల్లు లు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.ఆర్థిక ఇబ్బందు లతో సతమతమవుతున్న తాను అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నానని, స్థలం మంజూరు చేసి ఆదుకోవాల ని మంగళగిరి నియోజకవర్గం చిన కాకానికి చెందిన కే.ధనరాజ్ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకే ష్ (Nara Lokesh)హామీ ఇచ్చారు. రేషన్ కార్డులో తన ఇద్దరి పిల్లల పేర్లు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని మంగళగిరికి చెందిన కే.పూర్ణశేఖర్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞ ప్తి చేశారు. గతంలో ఎన్నిసార్లు అర్జీ లు పెట్టినా పట్టించుకోలేదన్నారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుం టామని మంత్రి హామీ ఇచ్చారు.
ఏలూరు జిల్లా పొంగుటూరు గ్రామా నికి చెందిన పసుపులేటి శ్రీను మం త్రి నారా లోకేష్(Nara Lokesh) ను కలిశారు. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి (Greenfield National Highway)కోసం సే కరించిన తమ మూడెకరాల భూ మికి తక్కువ పరిహారం అందిం చారని, మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేదని వాపో యారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ఎం.ఏ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించి ఆదు కోవాలని అనకాపల్లి జిల్లా బోయలకింతాడ గ్రామానికి చెందిన డీవీఎల్ ఎన్ మూర్తి విజ్ఞప్తి చేశారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన తమ మూడెకరాల అసైన్డ్ భూమిని గత వైసీపీ ప్రభుత్వ అండతో కబ్జా చేశారని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన గుంటి రాము మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తప్పు డు పత్రాలతో తమ భూమిని ఇత రుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిం చారని, ప్రశ్నించిన తమపై దాడి చేసి, భయబ్రాంతులకు గురిచే స్తున్నారని కన్నీటిపర్యంతమ య్యా రు.
తమకు ప్రాణరక్షణ కల్పించడం తో పాటు భూమిని అన్యాక్రాంతం చేసిన వారిపై కఠిన చర్యలు తీసు కోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మార్కె టింగ్ శాఖ, వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్లు, వాచ్ మెన్ లకు హెచ్ఆర్ పాలసీ అమలుచే యడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవ ర్గం ఎటపాకకు చెందిన గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ (nara lokesh)ను కలిశారు. గ్రామంలో 1 నుంచి 7వ తరగతి వరకు ఉన్న ఎయిడెడ్ స్కూల్ ను జడ్పీఎస్ఎస్ స్కూల్ గా మార్చా లని, గ్రామంలో రైతులకు ఉపయో గపడేలా వ్యవసాయానికి త్రీ ఫేజ్ కరెంట్ మంజూరు చేయాలని, గ్రామం గోదావరి వరద ముంపునకు గురికాకుండా కరకట్ట నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమకు వైద్య సాయం అందించాలని, అర్హత ఉన్న తమకు వృద్ధాప్య, దివ్యాంగ పెన్షన్ అందించి ఆదుకోవాలని, కాలేజీల్లో సీటు కల్పించాలని, ఉపకార వేత నాలు అందించాలని పలువురు మం త్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.