బీసీని ఆర్ఎస్ఎస్ చీఫ్ గా నియమించాలి
ప్రజాదీవెన, న్యూఢిల్లీ : రెండు శాతం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు సిగ్గుచేటు,దేశ వ్యాప్త కూలగణన కొరకు ఢిల్లీలో గర్జించిన మేకపోతుల నరేందర్ గౌడ్,
దేశ వ్యాప్తంగా కులగణన కొరకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ మంగళవారం డిల్లి లో గర్జించారు. జంతర్ మంతర్ ధర్నా చౌక్ లో ఏర్పాటు చేసిన మహా ధర్నా లో ఆయన కేంద్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు 1931 నాటి నుండి బీసీ రిజర్వేషన్లు తగ్గించుకుంటూ వస్తున్నారని ఆయన అభివర్ణించారు రెండు శాతం అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించడం కేంద్ర ప్రభుత్వం దిక్కుమాలిన ఆలోచన అన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి హిందూ నినాదం తప్పా ప్రజల ప్రగతి కొరకు చేసింది ఏమీ లేదన్నారు రాహుల్ గాంధీ కులం మతం తో మాకు సంబంధం లేదని నరేందర్ గౌడ్ అన్నారు మాకు కావలసింది కులగనణ అన్నారు అమెరికా లాంటి దేశాల్లో బెగ్గింగ్ చేస్తే జైలు శిక్షలంటాయని మన దేశం లో మూడు వందల కులాల జీవన వృత్తి అడుక్కోవడమని రికార్డుల్లో నమోదు చేశారసి నరేందర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు 1992-93 లో బీసీ కమిషన్ ఏర్పాటు లో 27శాతం రిజర్వేషన్లు 11శాతానికి తగ్గించి బీసీ లకు తీరని అన్యాయం చేశారని ఆయన అభివర్ణించారు మండల కమిషన్ కు బిజెపి సీపీఐ సిపిఎం కాంగ్రెస్ వ్యతిరేకంగా వ్యవహరించయని నేడు కాంగ్రెస్ తన తప్పును గ్రహించి కులగనాణ కు పూర్తి మద్దతిస్తుందన్నారు బిజెపి కి బీసీ లపై ప్రేముంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఆలె శ్యామ్ జిని నియమించాలి డిమాండ్ చేశారు.
ప్రతి రోజు ఉచితాల పేరుతో ప్రజలను సోమరిపోతులని చేస్తున్నారని మాజీ ఐఏఎస్ జయ ప్రకాష్ నారాయణ్ చేస్తున్న వాదన ను నరేందర్ గౌడ్ కొట్టిపారేస్తు వ్యాగంగా మాట్లాడారు.నరేందర్ గౌడ్ శ్రమ వృద కాదు మల్లు రవి,తెలంగాణ రాష్ట్రం లో కులగణన అంతిమ దశలో ఉందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. నరేందర్ గౌడ్ ఏర్పాటు చేసిన ధర్నా కు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు కులగనకు బీజేపీ సహకరించడం లేదన్నారు, విపి సింగ్ ను బీజేపీ బలవంతం గా గద్దె దించిందన్నారు కులగణకు దేశం లో రాహుల్ గాంధీ రాష్ట్రం లో రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందన్నారు. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ 1931నుంచి కులగనన ఆటంకలా నడుమ నలుగుతుందన్నారు, సోనియా గాంధీ రాహుల్ గాంధీ కులగనణ అనుకూల వైఖరి ప్రదర్శిస్తూన్నారాన్నారు రాజ్యాంగ పదవుల కోసం శాసనకర్తలు కావాల్సిన అవసరం ఉందన్నారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఓబీసీ ఇంటలెక్చవల్ ఫోరం జాతీయ అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణా మాట్లాడుతూ అంబానీకి 28 న్యూస్ చానల్స్ 21 న్యూస్ పేపర్స్ ఉన్నాయని అన్నారు, కేంద్రం ఈ డబ్ల్యూ ఎస్ కోటాను తీసుకువచ్చి బీసీలను మోసం చేసిందన్నారు.
పూలే అంబెడ్కర్ బాటలో మేకపోతుల నరేందర్ గౌడ్ నడుస్తున్నారని అన్నారు,అనంతరం సాధిస్తాం కూలగణన అని ధర్నా చౌక్ లో నినాదాలు చేశారు. ఈ కార్య క్రమం లో వర్కింగ్ ప్రసిడెంట్ సరికొండ రామ కృష్ణం రాజు, గిరగని బిక్షపతి, ఎర్ర శ్రీహరి, కడబోయిన మల్లేష్ యాదవ్, తవటం సత్యం, దేశ గాని నాగరాజు గౌడ్, కొత్త వినయ్ బాబు, మహేష్, బత్తుల మహేందర్ యాదవ్, కలల్ నరసింహులు పెంట అజయ్ పటేల్,కాల్వ మధుబాబు, పొన్నం ఉపేందర్ నాయుడు, దామోదర్ పాల్గొన్నారు