–గత అనుభవాలను వారు గమనం లోకి తీసుకోన్నట్లుoది
–కార్గిల్ యుద్ధస్మారకం వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్వరం
–కార్గిల్ యుద్ధ విజయ్ దివస్‌కు పాతికేళ్లు
–ద్రాస్‌లో సైనికులతో గడిపిన ప్రధాని,కార్గిల్ అమరులకు సీడీఎస్ నివా ళులు
Narendra Modi:ప్రజా దీవెన, ద్రాస్: దాయాది పాకిస్థాన్ ఉగ్ర కుట్రలను (Pakistan terror plots) సైన్యం తిప్పికొడుతుందని ప్రదానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) హెచ్చరించారు. ఉగ్రవాద ఘాతుకాలు, దొంగ యుద్ధాలతో కవ్వింపు చర్యలకు పాకిస్థాన్ పాల్పడుతూనే ఉందని, దాని ఆటలను పాతరేస్తామని, ము ష్కరుల దుశ్చర్యలను అణచివే స్తామంటూ తీవ్ర స్వరం వినిపించా రు. భారత వీర జవాన్ల శౌర్యానికి ప్రతీకగా నిలిచిన కార్గిల్ యుద్ధానికి నేటితో పాతికేళ్లు. విజయ్‌దివస్‌గా ఈ సందర్భాన్ని భారతావని శుక్రవా రం ఘనంగా జరుపుకొంది. ఆ యు ద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు, ఆ యుద్ధం జరిగిన కార్గి ల్ ప్రాంతంలోనే ప్రధానమంత్రి నరేం ద్రమోదీ నివాళులు అర్పించారు. విధుల్లో ఉన్న సైనికులతో కలిసి విజయ్‌దివస్‌ను జరుపుకొన్నారు. అక్కడ ఏర్పాటుచేసిన కార్గిల్ యు ద్ధ స్మారకాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు మోదీ గట్టి హెచ్చరిక చేశారు. జమ్మును కేంద్రం చేసుకుని గత నెల రోజుల్లోనే ఉగ్ర వాదులు ఆరుకు పైగా భారీ దాడు లు చేశారు.
ఈ నేపథ్యంలో మోదీ (modi) తీవ్రంగా స్పందించారు. పాక్ చరిత్ర అంతా ఓటములతో నిండిపోయిం దని, అయినా ఇప్పటికీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని, వారి నీచ ఉద్దేశ్యాలు ఏనాటికీ నెరవే రవని స్పష్టం చేశారు. ఉగ్రవాద పోషకులు కూడా వినగలిగే చోటు లో నిలబడి నేను ఈ మాట చెబు తున్నానని హెచ్చరించారు. అసత్య కథనాలు, ఉగ్రవాద ఉన్మాదంపై స త్యం సాధించిన విజయమే కార్గిల్ యుద్ధమని మోదీ అభివర్ణించారు. కార్గిల్‌లో (Kargil) భారత్ యుద్ధాన్ని మాత్ర మే గెలవలేదని, తిరుగులేని తన సామర్థాన్ని ప్రదర్శించిందని, అసా ధారణ రీతిలో సత్యాన్ని ఆవిష్క రించిందని మోదీ అన్నారు. కాగా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహా న్ కార్గిల్ అమరవీరులకు ఘన నివా ళులు అర్పించారు. వారి త్యా గాలు వృథా కాబోవన్నారు.
కాగా, పార్లమెంటులో సభ్యులు కార్గిల్ అమరవీరుల కోసం మౌనం పాటిం చారు. వారి మహోన్నత త్యాగాల కు దేశం రుణపడి ఉంటుందని రా హుల్‌గాంధీ అన్నారు. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ అభిలాష (Prime Minister Modi’s wish) మేరకు అగ్నివీరులుగా పనిచేసి వచ్చిన వారికి పోలీసు, ప్రాదేశిక సైనిక దళాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తాజాగా బీజేపీ పాలి త ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరా ఖండ్ రాష్ట్రాలు ప్రకటించాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా సైతం అగ్నివీరు లకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేం దుకు ముందుకు వచ్చాయని, హరి యాణా ఇదివరకే ఈ తరహా ప్రకట న చేసింది.అగ్నిపథ్ పథకంపై విప క్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాన మంత్రి మోదీ తిప్పికొట్టారు. జవాన్ల ను యుద్ధ సన్నద్ధులను చేయడా నికి ఈ పథకం ఎంతగానో తోడ్ప డిందన్నారు. యువసేనగా ఆర్మీని మార్చాలని దశాబ్దాలుగా పార్లమెం టులో, వివిధ కమిటీల్లో జరుగుతు న్న చర్చలు అగ్నిపథ్ రూపంలో సాకారం అయ్యాయన్నారు.
ఆర్మీలో (army)సేవలు అందిస్తున్న జవాను వయ సు ప్రపంచవ్యాప్త వయోసగటుతో పోల్చితే భారత్‌లోనే నిన్నటివరకు అధికంగా ఉండేదని గుర్తు చేశారు. ఎంతగానో బాధిస్తున్న ఈ సమస్య ను గుర్తించి, దానిపై ముఖ్యమైన సంస్కరణను సైన్యం చేపట్టిందన్నా రు. అయినా, జాతీయ భద్రతతో ముడిపడిన ఇటువంటి సున్నిత మైన అంశంపైనా కొందరు రాజకీ యం చేస్తున్నారని, స్వప్రయోజన కాంక్షతో అబద్ధాలు వల్లిస్తున్నారని మోదీ మండిపడ్డారు. కాగా, అగ్నిప థ్‌పై మోదీ వ్యాఖ్యలను విపక్షాలు తప్పుబట్టారు. కార్గిల్ విజయ దివ స్ నాడు కూడా మోదీ చిల్లర రాజకీ యాలు చేస్తున్నారని కాంగ్రెస్ అధ్య క్షుడు ఖర్గే విమర్శించారు. ఆర్మీ కోరి తేనే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథ కాన్ని అమలు చేస్తోందన్న రీతిలో మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని, ఇది పచ్చి అబద్ధమన్నారు. శౌర్య జవా నులకిది మరిచిపోలేని అవమాన మని మండిడ్డారు. ఈ పథకాన్ని రద్దు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌ను సైన్యానికి తెలియకుండా హఠా త్తుగా కేంద్రం ప్రవేశపెట్టిందని కాంగ్రె స్‌కు చెందిన మరో నేత జైరామ్ రమేశ్ (Jairam Ramesh) విమర్శించారు. ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఈ పథకాన్ని ఏకపక్షంగా తెచ్చారని అదే పార్టీకి చెందిన ఎంపీ వివేక్ టంఖా పేర్కొన్నారు.