–అసలు సిన్మా చూపించి తీరుతా
–మా పాలన పదేండ్లు పూర్తి కాగా మరో 20 ఏండ్లు మిగిలే ఉన్నాయ్
–నాలాంటి వారు ప్రధాని కావడానికి రాజ్యాంగమే కారణం
–రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ
Narendra Modi: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: భారత దేశంలో (In India) తమ ప్రభుత్వం పదేళ్ల పరిపూర్ణమైన పాలన పూర్తి చేసుకుందని, ఇంకా రాబోయే ఇరవై ఏండ్లు మిగిలే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నర్మగర్భంగా వ్యాఖ్యానిం చారు. రాజ్యాంగాన్ని తాము గౌరవి స్తామని, రాజ్యాంగం వల్లే తాను ప్రధాన మంత్రిని అయ్యానని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వానికి రాజ్యాంగమే రక్ష అని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలను ముందు కు తీసుకువెళ్తామని మోదీ (Narendra Modi) చెప్పా రు. ప్రధాని మాట్లాడుతున్న సమ యంలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు.
నీట్, మణిపూర్ (NEET, Manipur) అంశాలపై చర్చకు పట్టుబట్టారు. ప్రధాని అబ ద్ధాలు చెబుతున్నారని నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం ప్రధాని (modi)ప్రసంగాన్ని విపక్ష ఎంపీలు బహి ష్కరిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. విపక్షాల తీరుసు రాజ్యస భ చైర్మన్ ధస్కడ్ తప్పు పట్టారు. మోదీ మాట్లాడుతూ గతంలో రిమో ట్ సర్కారు సడిపేవారని కాంగ్రెస్ సు ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తమ పై విపక్షాలు ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మ లేదని, తమకే పట్టం కట్టారని అన్నారు. ప్రజాతీ ర్పును కొందరు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. ఎంత చెప్పినా విపక్షం వినకపోవడం బాధాకరమని పీఎం అన్నారు. అరవై ఏండ్ల తర్వా త పరుసగా ఒక పార్టీ మూడోసారి ప్రభుత్వాన్ని (The government for the third time) ఏర్పాటు చేసిందని చెప్పారు. వికసిత్ భారత్ సంకల్పం తో ముందుకు సాగుతున్నామని చెప్పారు. త్వరలోనే భారత్ మూ డో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (Largest economy)రూపు దిద్దుకోబోతున్నదని చెప్పారు.