Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narendra Modi: రాజ్యాంగంపై కపటప్రేమ దేశాన్నే జైలుగా మార్చినోళ్ళు

–రాజ్యాంగాన్ని అణచివేసి స్వేచ్ఛ సమానత్వాలను హరించారు
–నాడు 356 అధికరణను ఎడా పెడా ప్రయోగించారు
–తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చేందుకే గతం తవ్వుతున్నారు
–కాంగ్రెస్‌ పార్టీ వ్యవహార శైలిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం

Narendra Modi:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: భారత దేశంలో ఎమర్జెన్సీ విధించిన వారు రాజ్యాంగంపై (On the Constitution)కపట ప్రేమ కనబరు స్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ద్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ఇప్పటికీ అలనాటి ఆలోచనా విధా నం పోలేదని ఎద్దేవా చేశారు. 1975 లో జూన్‌ 25న ఇందిరాగాంధీ నేతృ త్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్య వసర పరిస్థితి విధించిందని ఆయ న మంగళవారం తన ‘ఎక్స్‌’లో (TWITTER) గు ర్తు చేశారు. అలనాటి చీకటి రోజు ల్లో దేశాన్నే జైలుగా మార్చారని రాజ్యాంగాన్ని అణచివేశారని, ప్రాథ మిక స్వేచ్ఛ లేకుండా చేశారని పేర్కొన్నారు. ఎన్నికైన ప్రభుత్వా లను రద్దుచేసే 356 అధికరణను ఎడాపెడా ప్రయోగించారని పత్రికా స్వేచ్ఛను నాశనం చేయడానికి బిల్లు తెచ్చారని, సమాఖ్య విధానా న్ని నాశనం చేశారని, రాజ్యాంగాన్ని ప్రతి దశలో ఉల్లంఘించారని దు య్యబట్టారు. రాజ్యాంగంపై (Constitution) అమిత ప్రేమ ఉందని పైకి చెబుతూ దానిపై ఉన్న ఏహ్య భావాన్ని నిజానికి దాచుకున్నారని ఆరోపించారు. ప్రజ లు వారిఅసంగత చర్యలను గ్రహిం చే పదే పదే ఓడిస్తున్నారని వ్యాఖ్యా నించారు. అధికారంలో కొనసాగేం దుకు ప్రజాస్వామిక సూత్రాలన్నీ తుంగలో తొక్కారని, కాంగ్రెస్‌ను వ్యతిరేకించే ప్రతి వ్యక్తినీ చిత్రహిం సల పాల్జేశారని విమర్శించారు. నాడు ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతి రేకించినవారికి ఇది నివాళులు అర్పించాల్సిన రోజుగా పేర్కొన్నా రు. ఓ కుటుంబాన్ని అధికారంలో ఉంచడం కోసం కాంగ్రెస్‌ (Congress) చాలా సార్లు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీ సిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah)ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ మైండ్‌సె ట్‌లో ప్రజాస్వామ్యానికి తావే ఉండ దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక విషయంలో విపక్షాలు కపటంతో, రెండు నాల్కల ధోరణితో వ్యవ హరిస్తున్నాయని ధ్వజమెత్తారు.

వైఫల్యాలను దాచేందుకే…

ప్రధాని మోదీ (MODI) తన వైపల్యాలను కప్పిపుచ్చుకోవడానికే గతాన్ని తవ్వితీస్తుంటారని ఏఐసీసీ అధ్యక్షుడు (President of AICC)మల్లికార్జున ఖర్గే మండి పడ్డారు. నిజానికి గత పదేళ్లుగా ఆయన అప్రకటిత ఎమర్జెన్సీని అమలుచేస్తున్నారని ‘ఎక్స్‌’లో ఆరోపించారు. ఆయన తరచూ ఏకాభిప్రాయం, సహకారం గురించి మాట్లాడతారని తద్విరుద్ధంగా వ్యవహరిస్తుంటారని విమర్శించా రు. పార్టీలను చీల్చడం ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదోవన పడగొ ట్టడం, 95 శాతం మంది ప్రతిపక్ష నాయకులపైకి ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను ఉసిగొల్పడం సీఎం లను జైల్లో (JAIL) పెట్టడం ఎన్నికలకు ముందు అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం, ఇవన్నీ అప్రకటిత ఎమర్జెన్సీ కాదా 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేసినప్పుడు మూడు కొత్త క్రిమినల్‌ చట్టాలను తెచ్చినప్పుడు వివాదాస్పద వ్యవ సాయ చట్టాలను తెచ్చినప్పుడు నోట్ల రద్దు, లాక్‌డౌన్‌, ఎలక్టొరల్‌ బాండ్ల చట్టం తెచ్చినప్పుడు మీరు చెప్తున్న ఏకాభిప్రాయం ఎక్కడుంద ని ఖర్గే ప్రధానిపై ధ్వజమెత్తారు.

వెంకయ్య నాయుడు (Venkaiah Naidu)ఇంటికి మోదీ మాజీ ఉప రాష్ట్రపతి వెంక య్య నాయుడితో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. మంగళవారం ఢిల్లీ లోని వెంకయ్య నాయుడి నివాసానికి (HOUSE) వెళ్లిన ఆయన కొద్దిసేపు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా దేశ ప్ర యోజనాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురూ తమ అభిప్రా యాలను పంచుకున్నారు. భారత దేశ పురోగతి పట్ల వెంకయ్యనా యుడు వివేకం ఎప్పుడూ ప్రశంసనీ యమే నని మోదీ (MODI)ఈ సందర్భంగా కొనియాడారు. కాగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీకి వెంకయ్య అభినందనలు తెలిపారు.