Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narendra Modi: వీక్షిత్ భారత్ ఆవిష్కరణే లక్ష్యం

–సమగ్రాభివృద్ధి కోసం సంఘటితం గా పోరాడుదాం
–వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే విపక్షాలు సభాసమయం వినియో గం
–విపక్షాలపై విరుచుకుపడిన ప్రధా న మంత్రి నరేంద్ర మోదీ

Narendra Modi:ప్రజాదీవెన, ఢిల్లీ: నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని 3.O బడ్జెట్‌పై ఈసారి భారీగా అంచనాలున్నాయి. ఏమైనా భారీ తాయిలాలు ప్రకటిస్తారా అని పారిశ్రామిక రంగాలు, వరాలు ప్రకటిస్తారనే ఆశలో మధ్యతరగతి వాళ్లు, ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. 2047 నాటికి వీక్షిత్‌ భారత్‌ను (Vikshit Bharat) ఆవిష్కరించడమే లక్ష్యంగా బడ్జెట్‌ ఉండబోతోందన్న సంకేతాలు ఇప్పటికే పంపించింది కేంద్రం. దీనికి సంబంధించి ఆర్థికవేత్తలు, పరిశ్రమవర్గాలతో ప్రధాని మోదీ సమావేశాలు కూడా నిర్వహించారు. ఈనెల 23న పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు మంత్రి నిర్మల సీతారామన్.. ఇవాళ పార్లమెంట్ లో ఆర్థిక సర్వేను ప్రకటించనున్నారు. అయితే.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు (Monsoon Sessions of Parliament) ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీడియాతో (Narendra Modi)మాట్లాడారు.. 2047 నాటికి విక్షిత్ భారత్ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని స్పష్టంచేశారు.

మూడోసారి అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్న మోదీ(Narendra Modi).. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. అమృతకాలంలో ఇదొక అద్భుతమైన బడ్జెట్‌ అన్నారు. కొన్ని పార్టీలు పార్లమెంట్ (Parties are Parliament)వేదికగా ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయని మండిపడిన ప్రధాని.. వచ్చే ఐదేళ్లు దేశాభివృద్ధి కోసం పోరాడాలని విపక్షాలకు పిలుపునిచ్చారు.. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై ఫైర్ (fire)అయ్యారు. కొన్ని పార్టీలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పార్లమెంటు సమయాన్ని ఉపయోగించుకున్నాయని, ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. గత సెషన్‌లో తనను మాట్లాడనివ్వకుండా చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నించాయని , ప్రజాస్వామ్యంలో అలాంటి ఎత్తుగడకు తావులేదన్నారు. పార్లమెంట్ తొలి సెషన్‌లోనే 140 కోట్ల మంది దేశ ప్రజల మెజారిటీతో ఎన్నికైన ప్రభుత్వం గొంతును నొక్కే ప్రయత్నం చేశారన్నారు.

కేంద్ర బడ్జెట్‌ (Central budget)రానున్న ఐదేళ్ల ప్రయాణానికి దిశానిర్దేశం చేస్తుందని, 2047లో ‘విక్షిత్‌ భారత్‌’ కలను సాకారం చేసేందుకు పునాది వేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. 60 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిందని.. అమృత్ కాల్ (Amrit call)లో ముఖ్యమైన బడ్జెట్ అని.. ఇది 2047లో విక్షిత్ భారత్ కలను నెరవేర్చడానికి పునాది వేస్తుందని తెలిపారు.