Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

National Movement for Old Pension Scheme: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వోట్ ఫర్ ఓపిఎస్ కొనసాగించాలి

–ఎన్ఎంఓపిఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ

National Movement for Old Pension Scheme: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశంలో ఈ సంవత్సరం ఎన్నికలు జరగ నున్న ఐదు రాష్ట్రాలైన మహా రాష్ట్ర, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, ఢిల్లీ లో వోట్ ఫర్ ఓపి ఎస్ కొనసాగించాలని తీర్మానించా రు. ఆదివారం న్యూ ఢిల్లీ లోని సుర్జీత్ భవన్ లో నేషనల్ మూ వ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (National Movement for Old Pension Scheme) సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో జరి గిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమా వేశంలో ఎన్. ఎంఓపియె స్ అధ్యక్షులు వి.కె బంధు, రామాం జనేయు లు,తెలంగాణ నుంచి కల్వల్ శ్రీకాంత్, నరేష్ గౌడ్, కర్ణాటక శాంతారం , హర్యానా దారివాల్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రదీప్ కుమార్,ఢిల్లీ నుండి మంజీత్ రానా మిగిలిన రాష్ట్రాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సెక్రెటరీ జనరల్ మాట్లాడుతూ ఈ సమావేశంలో పాల్గొన్న 22 రాష్ట్రాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి లు ఏకగ్రీవంగా యూ.పి.యెస్ విధానం వ్యతిరేకిస్తూ తీర్మానిం చారు. దేశ వ్యాప్తంగా ఎన్. పి.యెస్ ను రద్దు పరచి, పాత పెన్షన్ అమలు చేయలని సెప్టెంబర్ 26న దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో UPS/NPSకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయాలని, NMOPS జాతీయ కన్వెన్షన్ 15 డిసెంబర్ 2024న ఢిల్లీలో నిర్వహిస్తామని తీర్మా నించారు. ఈ సందర్భంగా సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ మాట్లాడుతూ, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపె ట్టిన పెన్షన్ సంస్కరణలో కూడా 99,77,165 మంది ఉద్యోగుల నుండి వసూలు చేసిన 10,53,850 కోట్ల రూపాయల పెన్షన్ నిధులను కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లను న్నా యని అన్నారు. సంపద కొద్ది మం ది దగ్గర కేంద్రీకృతం అవుతుందని, సంపద సృష్టించే వారు వృద్దాప్యం లో కనీస పెన్షన్ కూడా నోచుకోలేక పోతున్నారని వాపోయారు. సమా వేశంలో అన్ని రాష్ట్రాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు పాల్గొన్నారు.