Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NCTE B.ED: అలనాటి ఏడాది బీఈడీ, ఎంఇడి మళ్ళీ

— జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ప్రతిపాదనలు

NCTE B.ED: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: బీఈడీ, ఎంఈడీ కోర్సులు తిరిగి ‘ఒక ఏ డాది’ ఫార్మాట్‌కు తీసుకెళ్లాలని జా తీయ ఉపాధ్యాయ విద్యా మండ లి (ఎన్‌సీటీఈ) యోచిస్తోంది. ఈ మేరకు 2026–27 విద్యా సంవత్స రం నుంచి ఈ రెండు ప్రోగ్రామ్‌ల కా ల వ్యవధిని ఏడాదికి తగ్గించాలని ప్రతిపాదించింది. దీంతో ఈ కోర్సు ల కాల వ్యవధిని రెండేళ్లకు పొడి గించిన దశాబ్దం తర్వాత ఈ పరి ణామం చోటుచేసుకోనుంది.

ఎన్‌సీ టీఈ వెబ్‌సైట్‌లో ఉంచిన ముసా యిదా పాలసీపై మార్చి 8 వరకు ప్రజల అభిప్రాయాలు తీసుకోనుం ది. పాలసీ ఆమోదం తర్వాత స్వ తంత్ర ఉపాధ్యాయ విద్యా సంస్థలు (టీఈఐ) కొత్త ముసాయిదా నిబం ధనల్లో పేర్కొన్న షరతులకు అను గుణంగా ఉంటే, రెండేళ్ల బీఈడీ, ఎంఈడీ కోర్సులను అందించడం కొనసాగించవచ్చు. లేదా ఒక ఏ డాది ఫార్మాట్‌లో మారేందుకు అవకాశం ఉంటుంది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారంఅన్ని బీఈడీ, ఎంఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నేష నల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రామాణిక సబ్జెక్ట్‌, ఆప్టిట్యూట్‌ పరీక్ష నిర్వహించనుందని హిం దుస్థాన్‌ టైమ్స్‌ తన కథనంలో పే ర్కొంది.

ప్రస్తుతం ఎన్టీఏ ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీల్లో నాలుగేళ్ల ఇంటి గ్రేటెడ్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రా మ్‌ల (ఐటీఈపీ) అడ్మిషన్ల కోసం జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎన్‌ సీఈటీ) నిర్వహిస్తోంది. ఎన్టీఏ ని ర్వహించనున్న కొత్త ఐటీఈపీ కోర్సుల పరీక్షకు సంబంధించిన విధివిధానాలు వచ్చే ఏడాది రూ పొందించబడతాయని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి చైర్‌ పర్సన్‌ పంకజ్‌ అరోరా పేర్కొన్నా రు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఐటీఈపీ యోగా, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, సంస్కృత విద్య, కళా విద్య అనే 4 ప్రత్యేక కోర్సులను తీ సుకురానున్నట్లు ఎన్‌సీటీఈ తన ముసాయిదా నిబంధనలు 202 5లో పేర్కొంది.

కొత్త కోర్సులతో పాటు కనీస అవసరమైన సదు పాయాలు, అధ్యాపకులు వంటి అంశాలను కూడా ఎన్‌సీటీఈ నిర్దే శించింది. ముసాయిదా నిబంధనల ప్రకారం కనీసం 50 శాతం మా ర్కు లతో మాస్టర్స్‌ డిగ్రీ లేదా ప్రత్యేక సబ్జెక్ట్‌లో కనీసం 50 శాతం మార్కు లతో నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యు యేషన్‌ (యూజీ) కలిగిన అభ్యర్థి ఒక సంవత్సర బీఈడీ కోర్సుల్లో ప్ర వేశాలకు అర్హులు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు రెండేళ్ల ఎంఈడీ ప్రోగ్రామ్‌ అందించబడుతుందని ముసాయిదా పేర్కొంది. జాతీయ విద్యా విధానం సిఫారసుల మేరకు కొత్త నిబంధనలు రూపొందించి నట్లు అరోరా తెలిపారు.