Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NDA Budget: విపక్షాలపై విపరీత వివక్ష..!

–ఎన్డీయే బడ్జెట్‌పై ‘ఇండియా’ గరం గరం
–పార్లమెంటు నుంచి వాకౌట్‌, ప్రాంగ ణంలోనే విపక్ష సభ్యుల నిరసన

NDA Budget: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కేంద్రoలోని ఎన్డీయే కూటమి ప్రవేశపెట్టిన బడ్జె ట్‌ (budget)తో ప్రకంపనలు చెలరేగాయి. కేటాయింపులపై పెదవి విరిచిన విపక్షాలు ప్రకంపనలు పార్లమెంటు ను కుదిపేశాయి. ఇది కేవలం ‘కుర్చీ బచావో’ బడ్జెట్‌ అని, ప్రధాని మోదీ తన పదవిని కాపాడుకునేందుకే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ పాలిస్తున్న ఏపీ, బిహార్‌లకు బడ్జెట్‌ లో పెద్దపీట వేశారని మిగతా రాష్ట్రాలపై ముఖ్యంగా ప్రతిపక్షాల పాలనతో ఉన్న రాష్ట్రాలపై తీవ్ర వివక్ష చూపారని విపక్ష ఇండియా కూటమి బుధవారం గగ్గోలు పెట్టా యి. ఏ రాష్ట్రానికీ న్యాయం చేయలేదని ఇది భారత సమాఖ్య వ్యవస్థ పవిత్రతపైనే దాడిగా అభివ ర్ణిస్తూ ఉభయసభల నుంచి ఇండి యా కూటమి ఎంపీలు (mps) వాకౌట్‌ చేశా రు.

ఉదయం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో బడ్జెట్‌ కేటాయింపుల అంశాన్ని లేవనెత్తేందుకు విపక్ష స భ్యులు యత్నించారు. ప్రశ్నోత్తరా లను అడ్డుకోవద్దని స్పీకర్‌ ఓం బిర్లా కోరారు. పథకం ప్రకారమే సభ కా ర్యకలాపాలను అడ్డుకుంటున్నారని తప్పుబట్టారు. సభ్యులు సభలోకి రాకుండావిపక్ష ఎంపీలు మెట్ల వద్ద బైఠాయించి నిరసన తెలుపుతు న్నారని ఆయనతో పాటు పార్లమెం టరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు ప్రస్తావించారు. కేటాయింపు ల అంశాన్ని ప్రస్తావించనివ్వడం లేదంటూ విపక్ష ఎంపీలు వాకౌట్‌ చేశారు. రాజ్యసభలోనూ విపక్ష పాలిత రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయ డంపై ఇండియా కూటమి సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. 267 నిబం ధన కింద ప్రశ్నోత్తరాలు, ఇతర ఎజెండాను సస్పెండ్‌ చేసి ఈ అంశం పై చర్చించాలని నోటీసు ఇచ్చారు. దానిని సభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ తిరస్కరించారు. ప్రతిపక్ష నేత మల్లి కార్జున ఖర్గే (Malli Karjuna Kharge) మాట్లాడుతూ ‘2024– 25 బడ్జెట్‌లో బిహార్‌, ఆంధ్రకు మా త్రమే నిధులు, పథకాలు ఇచ్చారు. మిగతా రాష్ట్రాల ప్రస్తావనే లేదు.

ఈ బడ్జెట్‌ ‘కుర్సీ బచావో డాక్యు మెంట్‌’ అని ఆరోపించారు. ఈ వివక్షను కాంగ్రెస్‌, ఇతర ఇండియా కూటమి పార్టీలు ఖండిస్తున్నాయ న్నారు. దీనిపై స్పందించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా మన్‌కు (Nirmala Sitara Mann) చైర్మన్‌ అవకాశమిచ్చారు. ఆమె మాట్లాడేందుకు లేవగానే విప క్ష ఎంపీలు వాకౌట్‌ చేశారు. వారి ఆరోపణలు దారుణమని నిర్మలా సీతారామన్‌ ఆక్షేపించారు. బడ్జెట్‌ ప్రసంగంలో రాష్ట్రాల పేర్లు ప్రస్తావిం చనంత మాత్రాన విస్మరించినట్లు అవుతుందా అని ప్రశ్నించారు. తమ రాష్ట్రాలకు మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదని ప్రజల్లో నాటేందు కు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. తాజా బడ్జెట్‌లోనే కాదని ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జె ట్‌ ప్రవేశపెట్టినప్పుడు కూడా తాను చాలా రాష్ట్రాల పేర్లు ప్రస్తావించలేద న్నారు. దానర్థం కేంద్ర పథకాలు ఆ రాష్ట్రాల్లో అమలు కావడం లేదనా అని నిలదీశారు. ఈ రెండు బడ్జెట్ల లో మహారాష్ట్ర పేరును కూడా తా ను ప్రస్తావించలేదని అయినా ఆ రాష్ట్రంలో రూ.76 వేల కోట్ల భారీ పెట్టుబడితో వధావన్‌ పోర్టు ప్రాజె క్టును కేంద్ర కేబినెట్‌ ఆమోదించిం దని గుర్తుచేశారు. ‘ఫలానా రాష్ట్రం పేరు బడ్జెట్‌లో ప్రస్తావించలేదని.. కేంద్రప్రభుత్వ పథకాలు, కార్యక్రమా లు, ప్రపంచబ్యాంకు, ఏడీబీ, ఏఐఐ బీ తదితర ఆర్థిక సంస్థల ద్వారా అమలు చేసే విదేశీ రుణ సాయం ప్రాజెక్టులు (ఈఏపీ) ఈ రాష్ట్రాలకు రావా? ప్రభుత్వం ఇచ్చిన వ్యయ ప్రకటన చూస్తే దేనికెంత కేటాయిం పులు జరిపారో తెలుస్తుంది. ద మ్ముంటే గతంలో కాంగ్రెస్‌ ఆర్థిక మంత్రులు చేసిన బడ్జెట్‌ ప్రసంగా లను ఇవ్వండి. వాటిలో ప్రతి రాష్ట్రం పేరును వారు ప్రస్తావించా రా ఇది దారుణమైన ఆరోపణ. ఆమోదనీయం కాదని స్పష్టం చేశారు. వాకౌట్‌ చేసిన కొందరు టీఎంసీ ఎంపీలు ఇదే సమయంలో సభలోకి వచ్చారు. బెంగాల్‌కు ఏమీ ఇవ్వలేదని వారు ఆరోపించారని ప్రధాని మోదీ గత పదేళ్లలో ప్రారం భించిన చాలా పథకాలు ఆ రాష్ట్రం లో అమలు కావడం లేదని నిర్మల తెలిపారు. టీఎంసీ ఎంపీలు ఖండిం చారు. తమ రాష్ట్రానికి కేంద్రం రూ.లక్ష కోట్ల బకాయి ఉందని ఆరోపించారు.

పార్లమెంటు మెట్ల వద్ద విపక్ష ఎంపీల నిరసన ..పార్లమెంటు మెట్ల వద్ద విపక్ష ఎంపీలు నిరసనకు 0దిగారు. ఇతర రాష్ట్రాలను విస్మరిం చడం భారత సమాఖ్య పవిత్రతపైనే దాడి అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఈ సందర్భంగా వి మర్శించారు. ఈ నిరసనలో ఖర్గే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌ సోనియాగాంధీ, ఉభయసభల్లో ఆ పార్టీ ఉపనేతలు ప్రమోద్‌ తివారీ, గౌరవ్‌ గొగోయ్‌, సమాజ్‌వాదీ అధి నేత అఖిలేశ్‌ యాదవ్‌, ఎన్‌సీపీ (ఎస్‌సీపీ) నాయకుడు శరద్‌ పవార్‌, శివసేన (ఉద్ధవ్‌) ఎంపీ సంజయ్‌ రౌత్‌, టీఎంసీ, డీఎంకే. జేఎంఎం, ఆప్‌, సీపీఎం (cpm) తదితర విపక్ష ఎంపీలు పాల్గొన్నారు.