
NDA GSTReforms : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభు త్వం దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకువచ్చిన జిఎస్టి సంస్కరణ లను సామాజిక న్యాయం దిశగా తులనాత్మక అధ్యయనంతో స ముచితంగా విశ్లేషించిన ఈ గ్రంథం అత్యంత ప్రామాణికమైన రచన గా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నా రు.
వివక్ష రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా GST సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆమె స్పష్టం చేశారు. ఈ సంస్క రణలను సామాజిక న్యాయం, సం క్షేమం, అభివృద్ధి కోణాల్లో సమ గ్రంగా విశ్లేషిస్తూ రచయిత డా. వకుళా భరణం కృష్ణమోహనరావు ఈ గ్రం థాన్ని నిబద్ధతతో రూపొందించారని ఆమె ప్రశంసించారు. ఇలాంటి పరిశోధనాత్మక గ్రంథాలు మరిన్ని వెలువడాలని ఆమె ఆ కాంక్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రచయితను అభినందించా రు.
మంగళవారం పార్లమెంట్‌లోని G- 9లో తన అధికారిక చాంబర్‌లో ఈ గ్రంథాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్య సభ సభ్యుడు, బీజేపీ OBC జాతీయ మోర్చా అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర BC కమిషన్ మా జీ చైర్మన్, గ్రంథ రచ యిత డా. వకు ళాభరణం కృష్ణమోహనరావులతో కలిసి ఆవిష్క రించారు.అనంతరం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఈ గ్రంథం లో GST సంస్కరణలు సామాజిక న్యాయం, సంక్షేమం, అ భివృద్ధి లక్ష్యాల వైపు ఎలా దోహ ద పడుతున్నాయో స్పష్టంగా వివ రిం చారని తెలిపారు. ఈ గ్రంథం తప్ప నిసరిగా ప్రతి ఒక్కరికీ ఉపయో గపడుతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లా డుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మో దీ లక్ష్యాలను సాధికారికంగా ఈ గ్రం థంలో డా. వకుళాభరణం కృష్ణమో హనరావు విశ్లేషించారని అన్నారు. GST పన్ను తగ్గింపు లకే పరిమితం కాకుండా, ప్రజల జీవన ప్రమాణా లను శాశ్వతంగా పెంచే దిశగా అ మలులోకి తీసుకువచ్చిన గొప్ప సంస్కరణలుగా GST సంస్కరణలు నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
డా. కె. లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆశయాలను అందరికీ అ ర్థమయ్యే రీతిలో ఈ గ్రంథం ద్వారా ప్రజల ముందుకు తీసుకురా వడం డా. వకుళాభరణం కృష్ణమోహన రావు నిబద్ధతకు నిదర్శన మని అన్నారు. దేశంలో దశలవారీగా అనేక సంస్కరణలు అమల వుతున్నాయని, వాటిలో GST సంస్కరణలు అ త్యంత ప్రాముఖ్య త గలవని తెలిపారు.
గ్రంథ రచయిత డా. వకుళాభరణం కృష్ణమోహనరావు మాట్లాడు తూ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ చేతుల మీ దుగా తన గ్రంథం ఆవిష్కరించబడటం తనకు గొప్ప అనుభూతి, గౌరవమని అ న్నారు. తన నిరంతర కృషికి స ముచితమైన గు ర్తింపు లభించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రం థ ఆవిష్క రణకు సహకరించిన కేం ద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యు డు డా. కె. లక్ష్మణ్, అలాగే రా ష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాం చం దర్ రావులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.




