— రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్
Collector Srinivas : ప్రజాదీవెన నల్గొండ : భూభారతి అమలులో భాగంగా రెవిన్యూ సదస్సులలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు.
గురువారం అయన నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో నల్గొండ డివిజన్లోని తహసిల్దార్లు, డిప్యూటీ తహసిల్దారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. నల్గొండ ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు, డీటీలు, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్లు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.