Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NEET: వాయిదా లేదు గీయిదా లేదు..!

షెడ్యూల్ ప్రకటించలేదు
–ఈ నెల చివరలోనే నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌
–మీడియాల్లో రోజుకో వార్తతో విద్యార్థుల్లో ఆందోళన

NEET:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌పై
(NEET ug counselling)గందరగోళం నెలకొంది. నీట్‌ యూజీ జాతీయ కోటా కౌన్సె లింగ్‌ నిరవధికంగా వాయిదా పడిం దని శనివారం వార్తలు వెలువడ్డా యి. నీట్‌ కౌన్సెలింగ్‌ను వాయిదా(postpone) వేయాలని దాఖలైన పిటిషన్లను ఇటీవల సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎలాంటి అడ్డంకులు లేకపోయినా కౌన్సెలింగ్‌ను ఎందుకు నిరవధికం గా వాయిదా వేస్తున్నారని అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అయితే, ఈ వార్తలను కేంద్ర ఆరోగ్య శాఖ ఖం డించింది. అసలు కౌన్సెలింగ్‌ తేదీలే (counselling dates)ప్రకటించలేదని, అలాంటప్పుడు వాయిదాకు అవకాశం ఎక్కడని ప్రశ్నించింది. గత మూడేళ్లుగా ఎప్పుడూ జూలై మొదటి వారంలో కౌన్సెలింగ్‌ ప్రారంభం కాలేదని గుర్తు చేసింది. 2021 నీట్‌ కౌన్సెలింగ్‌ 20 22 జనవరిలో జరిగిందని, 2022 కౌన్సెలింగ్‌ అదే ఏడాది అక్టోబరులో జరిగిందని, 2023 కౌన్సెలింగ్‌ అదే ఏడాది జూలై 20న మొదలైందని ప్రస్తావించింది. ఈ విద్యా సంవ త్సరానికి నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ (NEET UG counselling)తేదీలను జూలై మూడో వారంలో ఖరారు చేస్తామని, పీజీ కౌన్సెలింగ్‌ తేదీలను ఆగస్టు రెండో వారం తర్వాత ఖరారు చేస్తామని గత నెలలోనే జాతీయ వైద్య కమిషన్‌ చెప్పిందని కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తు చేసింది. వాటికి అనుగుణంగా మెడి కల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ షెడ్యూ ల్‌ను ప్రకటిస్తుందని చెప్పింది.

సుప్రీంకోర్టు (supreme court)విచారణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూ డ్‌ నేతృత్వం లోని ధర్మాసనం సోమవారం చేపట్ట నున్నారు. కాగా, కొన్ని వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, తొలిదశ కౌన్సెలింగ్‌కే ఆ సీట్లు అందుబాటులో ఉండేట్లు చూస్తామని జాతీయ వైద్య కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి. నీట్‌ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని డిమాండ్లు ఊపందుకుంటుండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం భారీఎత్తున అక్రమాలు జరిగినట్లు రుజువేమీ లేకుండా రద్దు చేయడం వల్ల నిజాయితీతో పరీక్ష రాసిన లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందుల పాలవుతారని చెప్పింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నీట్‌ పరీక్షను రద్దు చేసి, మరింత పారదర్శకంగా నిర్వహించాలని శనివారం డిమాండ్‌ చేశారు. నీట్‌ అక్రమాలపై (neet)సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని కోరారు.

*విద్యార్థుల్లో అనవసర ఆందోళన..* …నీట్‌పై రోజుకో రకంగా వస్తున్న వార్తలతో రాష్ట్ర విద్యార్ధుల్లో ఒకరకమైన భయాందో ళనలు నెలకొన్నాయి. ఒకవేళ నీట్‌ రద్దు (NEET suspension)అయితే ఎలా అన్న టెన్షన్‌ వారిలో నెలకొంది. మెడిసిన్‌లో సీటు రాకపోతే ఇతర కోర్సులకు వెళ్లాలనేకునే విద్యార్దులు పెద్దసం ఖ్యలో ఉన్నారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే కొద్దీ ఇతర కోర్సుల్లో చేరే అవకాశం కూడా కో ల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మే 5న జరిగిన నీట్‌ పరీక్షలకు తెలంగాణ నుంచి 77,849 మంది హాజరు కాగా 47,371 మంది(60 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కేవలం 58 శాతమే ఉత్తీర్ణత సాధించగా ఈ మారు అది రెండు శాతం మేరకు పెరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 56 మెడికల్‌ కాలేజీలుండగా (medical colleges)వాటిలో 8515 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి.